Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత్ దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని పలువురు పాకిస్తాన్ నేతలు చెబుతున్నారు. భారత్ దాడి చేస్తే తాము తీవ్రంగా స్పందిస్తామని చెబుతూనే, పాకిస్తాన్ యుద్ధాన్ని నిలురించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది. మంగళవారం, ప్రధాని మోడీ అధ్యక్షత జరిగిన అత్యున్నత సమావేశంలో, త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛని ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
నాని హీరోగా నటిస్తున్న “హిట్: థర్డ్ కేస్” సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన పహల్గాం అనే ప్రాంతంలో జరిగింది. తాజాగా ఈ విషయాన్ని నాని ముందు ప్రస్తావించగా, ఆయన స్పందిస్తూ, నిజానికి పహల్గాంలో కాల్పులు జరిగిన ప్రాంతంలో కాదు, కానీ ఆ చుట్టుపక్కల చాలా చోట్ల షూటింగ్ జరిపామని తెలిపారు. సుమారు పది రోజులపాటు ప్రశాంతంగా షూటింగ్ జరిగిందని, కానీ ఆ తర్వాత మా…
పాకిస్తాన్ తో భారత్ ఉద్రిక్తత మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా మండలిలో ప్రభుత్వం మార్పులు చేసింది. దీనికి చైర్మన్గా రా మాజీ చీఫ్ అలోక్ జోషి నియమితులయ్యారు. దేశంలోని ప్రధాన గూఢచారి సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనలిటికల్ వింగ్ R&AW కి గతంలో నాయకత్వం వహించిన శ్రీ జోషి, సాయుధ దళాలు, పోలీసు సేవ, విదేశీ సేవల నుంచి రిటైర్డ్ అధికారులతో కూడిన ఏడుగురు సభ్యుల బోర్డుకు నాయకత్వం…
పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం పాక్ పై దౌత్య దాడికి దిగి కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగా ఏప్రిల్ 24న పాకిస్తాన్ జాతీయులు ఏప్రిల్ 27లోపు భారతదేశం విడిచి వెళ్లాలని ప్రభుత్వం ప్రకటించింది. వైద్య వీసాలు ఉన్నవారికి ఏప్రిల్ 29 వరకు గడువునిచ్చింది. దౌత్య, అధికారిక, దీర్ఘకాలిక వీసాలు ఉన్నవారిని ‘లీవ్ ఇండియా’ నోటీసు నుంచి మినహాయించారు. స్వల్పకాలిక వీసాల 12 వర్గాలలో దేనినైనా కలిగి ఉన్న పాకిస్తానీయుల గడువు ఆదివారంతో ముగిసింది. Also…
పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ కు బుద్ధి చెప్పాలిన ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ నాయకులు నిరంతరం ఒళ్లు బలుపు మాటలు, బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ అణ్వాయుధ శక్తిని కలిగి ఉన్నందున…
పహల్గామ్ ఉగ్ర దాడిపై పాకిస్థా్న్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ప్రాణ నష్టం జరగడం విషాదకరమని తెలిపారు.
PM Modi: ఢిల్లీలో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. వరసగా సమావేశాలతో ప్రధానితో సహా కేంద్ర మంత్రులు బిజీ బిజీగా ఉన్నారు. మంగళవారం, ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు – ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి,…
PM Modi: పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలపై ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్పందించడానికి భారత త్రివిధ దళాలకు పూర్తిగా స్వేచ్ఛను ఇచ్చారు. ప్రధాని మోడీ నివాసంలో జరిగిన అత్యున్నత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని మోడీ ఆదేశించారు.
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకుంది. రెండు దేశాలు కూడా యుద్ధానికి సిద్ధమయ్యేందుకు అవసరమైన మిలిటరీ ఎక్సర్సైజులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ ఉగ్రవాద దాడిపై పలు దేశాలు స్పందించాయి. అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలు భారతదేశానికి మద్దతు పలికాయి. ఉగ్రవాదాన్ని అణిచివేయాలని, ఈ విషయంలో భారత్కి తాము మద్దతు తెలుపుతామని చెప్పాయి.
PM Modi: పహల్గామ్ ఉగ్రదాడి, పాకిస్తాన్పై ప్రతీకార చర్యల్లో భాగంగా ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ హాజరయ్యారు. త్రివిధ దళాధిపతులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహిస్తున్నారు.