Pakistan: పాకిస్తాన్‌ని బిగ్ షాక్ ఇచ్చిన మిత్రదేశం టర్కీ..
- పాకిస్తాన్‌కి బిగ్ షాక్ ఇచ్చిన మిత్ర దేశం టర్కీ..
- తాము ఎలాంటి ఆయుధాలు పంపలేదన్న టర్కీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకుంది. రెండు దేశాలు కూడా యుద్ధానికి సిద్ధమయ్యేందుకు అవసరమైన మిలిటరీ ఎక్సర్‌సైజులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ ఉగ్రవాద దాడిపై పలు దేశాలు స్పందించాయి. అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలు భారతదేశానికి మద్దతు పలికాయి. ఉగ్రవాదాన్ని అణిచివేయాలని, ఈ విషయంలో భారత్‌కి తాము మద్దతు తెలుపుతామని చెప్పాయి.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ కూడా తన మిత్రులను కలుసుకుంటోంది. ప్రస్తుతం పాకిస్తాన్‌కి టర్కీ, చైనా, మలేషియా, అజర్ బైజార్ మంచి మిత్రులుగా ఉన్నాయి. తాజాగా, వస్తున్న సమాచారం ప్రకారం, టర్కీ పాకిస్తాన్‌కి ఈ వివాదంలో సాయం చేయలేమని ప్రకటించినట్లు సమాచారం. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీ, పాకిస్తాన్‌కి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పంపినట్లు వార్తలు వచ్చాయి. సైనిక పరికరాలను ఇచ్చేందుకు టర్కీష్ C-130E హెర్క్యులస్ కరాచీలో దిగిందని నివేదికలు తెలిపాయి. దాదాపుగా ఆరు C-130E విమానాలు పాకిస్తాన్‌లో దిగాయని పలు మీడియా సంస్థలు పెర్కొన్నాయి.
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
Read Also: Jogulamba Gadwal: ఘోర ప్రమాదం.. నర్సింగ్ విద్యార్థులను డీకొన్న బోలెరో వాహనం.. ఇద్దరు మృతి
అయితే, ఈ వాదనల్ని టర్కీ తిరస్కరించింది. టర్కీ నుంచి వచ్చిన కార్గో విమానం కేవలం ఇంధనం నింపుకోవడానికి మాత్రమే పాకిస్తాన్లో దిగిందని ప్రెసిడెన్సీ కమ్యూనికేషన్స్ డైరెక్టరేట్ చెప్పిందని టర్కియే టుడే నివేదిక తెలిపింది. టర్కీ పాకిస్తాన్‌కు ఆయుధాలతో కూడిన విమానాలను పంపినట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని టర్కిష్ అధికారులు సోషల్ మీడియా పోస్టులో తెలిపారు.
పాకిస్తాన్‌కి టర్కీ దీర్ఘకాలిక మిత్రుడుగా ఉంది. ఇరు దేశాలు కూడా వ్యూహాత్మక సంబంధాలను పెట్టుకున్నాయి. పలు సందర్భాల్లో కాశ్మీర్ విషయంలో టర్కీ, పాకిస్తాన్‌కి వంతపాడింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్ పలు వేదికలపై కాశ్మీర్ విషయాన్ని ప్రస్తావించారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. కాశ్మీర్ భారత్‌లోని అవిభజిత అంతర్భాగమని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..