Pak Hackers: 26 మంది అమాయకపు టూరిస్టులను బలిగొన్న పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత, భారతీయ సైట్లపై పాకిస్తాన్ హ్యాకర్ల దాడులు పెరిగాయి. ఇండియన్ సైట్లను హ్యాక్ చేసే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. మంగళవారం, శ్రీనగర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్(APS), APS రాణిఖేత్, ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్ (AWHO) డేటాబేస్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేస్‌మెంట్ ఆర్గనైజేషన్ పోర్టల్స్‌ని హ్యాకర్స్ టార్గెట్ చేశారు. “IOK హ్యాకర్”గా పనిచేస్తున్న హ్యాకర్లు ఈ వెబ్‌సైట్‌లను డీఫేస్ చేయడానికి ప్రయత్నించారు.
Read Also: Pahalgam Terror Attack: పహల్గామ్ సూత్రధారికి పాకిస్తాన్ కమాండో ట్రైనింగ్..
అయితే, ఈ దాడిని భారత అధికారులు భగ్నం చేశారు. రియల్-టైమ్ మానిటరింగ్ సిస్టమ్‌లు, బలమైన డిజిటల్ ఫైర్‌వాల్‌తో కూడిన భారత సైన్యం యొక్క సైబర్ సెక్యురిటీ ఫ్రేమ్‌వర్క్ ఈ చొరబాటు ప్రయత్నాలన్నింటినీ సమర్థవంతంగా అడ్డుకుంది. ముఖ్యంగా, ఆర్మీ పబ్లిక్ స్కూల్ శ్రీనగర్ ఈ దాడిని ఎక్కువగా ఎదుర్కొంది. కొంత సమయం వరకు సేవలకు అంతరాయం కలిగింది. భారత సైన్యం తన సైబర్ సంసిద్ధతను నిరంతరం అప్‌గ్రేడ్ చేస్తోందని పునరుద్ఘాటిస్తోంది. ఆపరేషనల్ సిస్టమ్స్‌ని రక్షించడమే కాకుండా సైనికులు, వారి కుటుంబాలతో అనుసంధానించబడిన ప్రతి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను కూడా రక్షించడం తన లక్ష్యం అని సైన్యం తెలిపింది.
ఈ రోజ, పాకిస్తాన్ హ్యాకర్లు మూడు రాజస్థాన్ ప్రభుత్వ వెబ్‌సైట్లను టార్గెట్ చేశారు. వీటిలో భారత వ్యతిరేక సందేశాలను పోస్ట్ చేశారు. ఒక పోస్ట్‌లో, ‘పాకిస్తాన్ సైబర్ ఫోర్స్’లో భాగమని చెప్పుకునే హ్యాకర్లు, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తూ భారతదేశం గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.