జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాద దాడి ప్రపంచాన్నే కుదిపేసింది. ఈ ఘటనను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. 26 మంది అమాయక జనాలు చనిపోడంతో సంతాపం ప్రకటిస్తు్న్నారు. పర్యటకులను కాల్చి చంపే ముందు.. ఉగ్రవాదులు వారి మతం గురించి అడిగారు. మానవాళికే సిగ్గుచేటు తెచ్చిన ఈ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. తాజాగా ఉత్తరాఖండ్ హరిద్వార్ నగరం భగత్ సింగ్ చౌక్ సమీపంలోని రోడ్లపై నిరసన…
CM M K Stalin: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్ర దాడి తమిళనాడు రాష్ట్రంలో జరగదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఇక, మతతత్వం ఎన్నటికీ తమిళనాడును ఆక్రమించదని తేల్చి చెప్పారు.
Ready to War: పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి భారత దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటన తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. సోషల్ మీడియాలో యుద్ధం గురించి చర్చలు ఊపందుకున్నాయి. ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ, యుద్ధం అంత సులభమా? ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం సాధ్యమా? పహల్గామ్ దాడి తర్వాత భారత ప్రజలలో ఆగ్రహం పెల్లుబికుతోంది. పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలంటూ చాలా మంది గళమెత్తుతున్నారు. ఓర్పు, సహనం ఇక చాలని.. వన్స్ ఫర్…
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలపై రంగంలోకి దిగింది ఏఐసీసీ.. పార్టీ లైన్ కి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన నాయకులను అంతర్గతంగా మందలించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. ప్రశాంతంగా ఉన్న కశ్మీర్.. మరోసారి నెత్తురోడింది. పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి.. 26 మంది పర్యాటకుల్ని పొట్టనపెట్టుకున్నారు. దీని వెనక పాకిస్థాన్ ఉందని తేలిపోవడంతో దేశమంతా రగలిపోతుంది. యుద్ధం ప్రకటించి.. దాయాదికి తగిన బుద్ధి చెప్పాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మన సత్తా చూపాలని, పాకిస్థాన్ తిరిగి లేవకుండా.. చావ చితక్కొట్టాలని చాలామంది కోరుతున్నారు.
Asaduddin Owaisi: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రవాద దాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. పాకిస్తాన్ సర్కార్, దాని నిఘా సంస్థ ISI యొక్క అక్రమ సంతానమే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అని ఆరోపించారు.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత దేశమంతా దు:ఖంలో ఉంటే ఉత్తరప్రదేశ్కు చెందిన జానపద గాయని నేహా సింగ్ రాథోడ్ మాత్రం దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టింది.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర పెద్దలు భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చలు జరుపుతున్నారు. సోమవారం ఉదయం ప్రధాని మోడీతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ భేటీ అయ్యారు.
పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండిస్తూ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం సురిందర్ చౌదరి తీర్మానం ప్రవేశపెట్టారు. ముక్తకంఠంతో శాసనసభ ఉగ్రదాడిని ఖండించింది.