Bilawal Bhutto: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది టూరిస్టుల్ని టెర్రరిస్టులు హతమార్చారు. లష్కరే తోయిబాకు చెందిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. అయితే, అప్పటి నుంచి భారత్ పాకిస్తాన్‌పై ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే, సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్-పాకిస్థాన్‌ల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ప్రస్తుతం రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరారు.
పహల్గామ్లో నేరమేధం సృష్టించిన ఉగ్రవాదులు ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఒక నిర్ధారణకు వచ్చింది. దక్షిణ కాశ్మీర్‌లోని దట్టమైన అడవుల్లో సేఫ్ జోన్లో ఉన్నట్లుగా భావిస్తోంది.
పహల్గామ్ ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి కీలక వ్యాఖ్యలు చేశారు. వినయ్ నర్వాల్ గౌరవార్థం నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరమ్ ఆఫ్ ఆర్టిస్ట్స్ అండ్ యాక్టివిస్ట్స్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి హిమాన్షి హాజరయ్యారు.
Eknath Shinde: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాని నరేంద్రమోడీ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. ఇండియా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు బలమైన దౌత్య నిర్ణయాలు తీసుకుంది. దేశ ప్రజలు ప్రస్తుతం సైనిక ప్రతిస్పందన ఆశిస్తున్నారు. "ఇది చివరి దాడి అవుతుందని మన ప్రజలు నమ్ముతున్నారు. ప్రధాని మోడీ పాకిస్తాన్‌ను తుడిచిపెడతారు" అని షిండే చెప్పారు.
Gurpatwant Singh Pannun: పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇలాంటి సమయంలో, ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌తో భారత్ యుద్ధం చేస్తే సిక్కులు ఈ యుద్ధంలో పాల్గొనవద్దని పిలుపునిచ్చాడు.
India Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి భారత్, పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత, యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. 26 మందిని బలి తీసుకున్న ఈ ఉగ్రదాడిలో పాకిస్తాన్, లష్కరే తోయిబా ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా తేలింది. అయితే, పాకిస్తాన్ ఇప్పటికే తన సైన్యాన్ని భారత సరిహద్దుల్లో మోహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్, బంగ్లాదేశ్ సాయంతో భారత సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం వస్తోంది.
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ తన యుద్ధ సన్నాహాలు చేసుకుంటోంది. భారత్ నుంచి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఘర్షణ ప్రారంభమవుతుందో అని భయపడి చేస్తోంది. మరోవైపు, భారత్‌ని కవ్వించేలా పలు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే, ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ రేంజర్లు కాల్పులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. కరాచీ పోర్టులో పాక్ నేవీ తన నౌకల్ని, జలంతార్గముల్ని మోహరించినట్లు సమాచారం.
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌కి భయాందోళనలు పెరిగాయి. కాశ్మీర్ అందాలను చూస్తున్న అమాయకపు ప్రజలపై పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై, టెర్రరిజంపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.