Sanjay Raut: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో శివసేన (ఠాక్రే) నేత సంజయ్ రౌత్ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఆయన పాకిస్తాన్‌తో యుద్ధం చేసేలా లేరని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ కాశ్మీర్లో పెద్ద ఊచకోత జరిగింది.
Pakistan: పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ వేరు కాబోతోందా..? అంటే పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి మూల్యంగా పాకిస్తాన్ బలూచిస్తాన్ని చెల్లించబోతోంది.
Pahalgam Terror Attack: 26 మంది టూరిస్టుల్ని బలితీసుకున్న పహల్గామ్ ఉగ్రదాడి టెర్రరిస్టులు చెన్నై మీదుగా శ్రీలంకుకు చేరుకున్నారని భారత్ నుంచి వచ్చిన సమాచారం మేరకు శనివారం మధ్యాహ్నం కొలంబో విమానాశ్రయంలో భారీ తనిఖీలు జరిగాయి. ఉదయం 11.59 గంటలకు కొలంబోలోని బండరానాయకే అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న శ్రీలంక ఎయిర్ లైన్స్‌కి చెందిన UL122 విమానాన్ని భద్రతా దళాలు క్షుణ్ణంగా తనిఖీ చేశాయి.
India Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్‌కి భారత్ చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్‌ని ఎలా దెబ్బతీస్తే ఆ దేశం పతనమవుతుందో అలాంటి నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే, పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు నదికి సంబంధించిన ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంది. పాక్ రాజకీయ నేతలు, సెలబ్రెటీలు, సినీయాక్టర్ల ఇన్‌స్టా అకౌంట్లు, యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది. పాక్ మీడియా, వెబ్సైట్లను నిషేధించింది. ఇదే కాకుండా, పాక్ విమానాలకు భారత్ తన గగనతలాన్ని నిషేధించింది
India Pakistan: పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే, పాకిస్తాన్ నాయకులు మాత్రం రోజుకో ప్రకటన చేస్తూ, రెండు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతను పెంచుతున్నారు. తాజాగా, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ..
PM Modi: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ‘‘ది రెసిస్టెన్స్ ఫోర్స్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులు 26 మంది సాధారణ పౌరుల్ని క్రూరంగా కాల్చి చంపారు. ఉగ్రవాదులు, దాని మద్దతుదారులు ప్రపంచంలో ఎక్కడా ఉన్నా వదిలిపెట్టేది లేదని ఇప్పటికే ప్రధాని ఉగ్రవాదులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ఉద్రిక్తతల్ని మరింత పెంచుతూ పాక్ కవ్వింపులకు దిగుతోంది. ఇప్పటికే, గత 9 రోజులుగా ఎల్ఓసీ వెంబడి పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా పాకిస్తాన్ ‘‘బాలిస్టిక్ మిస్సైల్’’ని విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించింది.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధు జలాలు నిలిపివేసింది. అనంతరం వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు మూసివేసింది.
భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తల మధ్య కర్ణాటక మంత్రి బీజడ్ జమీర్ అహ్మద్‌ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా అనుమతిస్తే.. పాక్‌లో ఆత్మాహుతి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.