PM Modi: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ‘‘ది రెసిస్టెన్స్ ఫోర్స్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులు 26 మంది సాధారణ పౌరుల్ని క్రూరంగా కాల్చి చంపారు. ఉగ్రవాదులు, దాని మద్దతుదారులు ప్రపంచంలో ఎక్కడా ఉన్నా వదిలిపెట్టేది లేదని ఇప్పటికే ప్రధాని ఉగ్రవాదులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ఉద్రిక్తతల్ని మరింత పెంచుతూ పాక్ కవ్వింపులకు దిగుతోంది. ఇప్పటికే, గత 9 రోజులుగా ఎల్ఓసీ వెంబడి పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా పాకిస్తాన్ ‘‘బాలిస్టిక్ మిస్సైల్’’ని విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించింది.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధు జలాలు నిలిపివేసింది. అనంతరం వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు మూసివేసింది.
భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తల మధ్య కర్ణాటక మంత్రి బీజడ్ జమీర్ అహ్మద్‌ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా అనుమతిస్తే.. పాక్‌లో ఆత్మాహుతి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు పోయిన తర్వాత, పాకిస్తాన్ ఇప్పుడు భారత్ నుంచి తనను తాను రక్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఈ దాడిలో పాక్ ప్రమేయం ఉన్నట్లు, పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఉగ్రదాడి జరిగనప్పటి నుంచి పాకిస్తాన్ భయంతో వణుకుతోంది. బయటికి మాత్రం ఆ దేశ రాజకీయ నేతలు పెద్దపెద్ద స్టేట్మెంట్లు ఇస్తూ, అక్కడి ప్రజల్ని నమ్మిస్తున్నారు తప్పితే, లోలోపల మాత్రం భారత్ ఏం…
India-Pak tensions: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాకిస్తాన్ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పరిస్థితి తీవ్రతను మరింత పెంచారు. భారత్ తమపై దాడికి సిద్ధమవుతుందని సాక్ష్యాత్తు ఆ దేశ మంత్రులే వ్యాఖ్యానించారు. ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పాక్ సైన్యం భారత సరిహద్దుల్లో మోహరించింది. మరోవైపు, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) పై భారత్ దాడి చేస్తుందేమో అని పాక్ తెగ భయపడుతోంది. ఈ మేరకు ఇప్పటికే పీఓకేలోని…
Pakistan Army: అన్ని దేశాలకు సైన్యం ఉంటుంది, కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం ఓ సైన్యానికి దేశం ఉందని చెప్పవచ్చు. భారత్ వంటి దేశాల్లో మిలిటరీ చీఫ్లుగా పని చేసిన వారు రిటైర్మెంట్ తర్వాత సాధాసీదా జీవితం గడుపుతారు. కానీ పాకిస్తాన్లో అలా కాదు మిలిటరీలో చేరితే జాక్‌పాట్ కొట్టినట్లు, ప్రభుత్వమే పదుల నుంచి వందల ఎకరాల భూమిని ఆర్మీలో పనిచేసిన వారికి ఇస్తుంది.
India-Pakistan War: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దాయాది దేశానికి చెందిన కళాకారులు, ప్రముఖులకు సంబంధించిన యూట్యూబ్, సోషల్ మీడియా అకౌంట్లను భారతదేశం బ్లాక్ చేస్తుంది. ఈ సందర్భంగా పాక్ నటుడు ఫవాద్ ఖాన్, గాయకుడు అతిఫ్ అస్లాంల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను నిలిపివేయబడింది.
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లష్కరే తోయిబా ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో అనే భయంతో పాకిస్తాన్ తన గగనతలాన్ని భారత వైమానిక సంస్థలకు మూసేసింది.