Bilawal Bhutto: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది టూరిస్టుల్ని టెర్రరిస్టులు హతమార్చారు. లష్కరే తోయిబాకు చెందిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. అయితే, అప్పటి నుంచి భారత్ పాకిస్తాన్‌పై ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే, సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. ఇటీవల, దీనిపై పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘‘సింధు జలాలను భారత్ ఆపితే, భారతీయు రక్తం అందులో ప్రవహిస్తుంది’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.
Read Also: Kollywood : ఆ ఇద్దరు భామలకు మేలు చేసిన బ్రేకప్
ఇదిలా ఉంటే, తాజాగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తుందనే నిజాన్ని ఒప్పుకున్నాడు. దీనికి ముందు, పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కూడా పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న విషయాన్ని అంగీకరించారు. ‘‘పాకిస్తాన్‌కి గతం ఉందనేది రహస్యం కాదని, దాని పరిణామాల వల్ల దేశం బాధపడింది’’ అని తీవ్రవాదం గురించి చెప్పారు. ‘‘ మనం తీవ్రవాదం తర్వాత వరుస దాడులను ఎదుర్కొన్నాము. మనం బాధపడ్డ దాని ఫలితంగా, మనం పాఠాలు కూడా నేర్చుకున్నాము. ఈ సమస్యను పరిష్కరించడానికి మనం అంతర్గత సంస్కరణల చేపట్టాము’’ అని అన్నారు.
దేశం ఇప్పుడు ఇలాంటి అంశాలకు (ఉగ్రవాదానికి) మద్దతు ఇవ్వడం లేదని చెబుతూనే, పాకిస్తాన్ చరిత్ర విషయానికి వస్తే, అది చరిత్ర అని, మనం నేడు ఉగ్రవాదనికి మద్దతు తెలుపుతున్నట్లు కాదు, అది మన చరిత్రలో దురదృష్టకరమైన భాగం అని ఆయన అన్నారు.