తెలంగాణ ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత నెలకొంది. యాసంగి ధాన్యం మేమే కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందని, బీజేపీ పోరాటం దీక్ష ఫలితంగా సీఎం దిగొచ్చి ధాన్యం కొంటామని చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. ఇది తెలంగాణ రైతుల, బీజేపీ కార్యకర్తల విజయమని ఆయన అన్నారు. కింద పొగ పెడితే తట్టుకోలేక కుర్చీ కోసం ధాన్యం కొంటామని ప్రకటించారని, వరి వేస్తే ఉరి అన్న సీఎం చేతనే వరిని కొనిపిస్తున్నామన్నారు. రైతుల కోసం దెబ్బలు తిన్నామని, రైతులు తిరగనియ్యరని భయపడి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పాడన్నారు.
తెలంగాణ రైతుల నుండి ధాన్యం కొనుగోలు కోసం 97 వేల కోట్లు ఖర్చు చేసిందని, సీఎంతోక ముడిచి పారిపోయారని ఎద్దేవా చేశారు. కేంద్రం కొనేందుకు సిద్ధంగా ఉందని చెప్పామని, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామని చెప్పింది… ధాన్యం కొనుగోలు చేయమని చెప్పింది ఆయనే అని, ఇప్పటికే రైతులు తక్కువ ధరకు తమ పంటను అమ్ముకున్నారన్నారు. ఆ రైతుల పరిస్థితి ఏంది.. ఆ రైతులకు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
https://ntvtelugu.com/cm-kcr-clarity-about-paddy-procurement/