ప్రతీ గింజను కొనాల్సింది సీఎం కేసీఆరేనని డిమాండ్ చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. దాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్‌వి డ్రామాలు అని మండిపడ్డారు.. ఇప్పటికే 50 శాతం ధాన్యం రైతులు అమ్ముకున్నారని.. మిల్లర్లకు అమ్మిన రైతులకు కూడా మద్దతు ధర ఇవ్వాలని సూచించారు.. గవర్నర్‌తో భేటీకి ముందు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. గవర్నర్ దృష్టికి అన్ని సమస్యలు తీసుకెళ్తాం అన్నారు.. ప్రభుత్వంపై భారం మూడు వేల కోట్ల అని మేం మొదటి నుండి చెబుతున్నాం.. అయినా వినిపించుకోలేదని ఫైర్ అయ్యారు. ఇక, రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు.
Read Also: Ukraine War: ప్రక్షాళన చేపట్టిన పుతిన్.. ఎఫ్‌ఎస్‌బీలోని కీలక అధికారుల అరెస్ట్..!
సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు కోమటిరెడ్డి.. రైతులు ఇప్పటికే రూ.1400కి ధాన్యాన్ని అమ్ముకున్నారని.. తక్కువ ధరకు అమ్ముకున్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులని ఆదుకోవాలన్నారు. ఇక, కేసీఆర్ బాయిల్డ్‌రైస్ ఇవ్వను అని కేంద్రానికి ఎందుకు లేఖ రాశాడు? లేఖ రాసి తర్వాత మళ్లీ డ్రామాలు ఏంటి? రుణమాఫీ ఏమైంది..? అని నిలదీశారు. కౌలు రైతులే ఎక్కువ నష్టపోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. వారిని ఆదుకోవాలి కోరారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.