కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ లో యాసంగి వరిధాన్యం కొనబోమని పదే పదే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో… రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వొక్క కిలో వడ్లు కూడా కొనలేదని, రాష్ట్రం లో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోవడం లేదని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు పునరుద్ఘాటించారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధనాలనుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడేందుకు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి, ధాన్యం కొనబోమనే విషయాన్ని అర్థం చేయించాలని సీఎం కెసీఆర్ కలెక్టర్లను, వ్యవసాయ…
ఏపీలో జగన్ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా కేంద్రాల వల్ల విప్లవం రాబోతోందన్నారు వ్యవసాయమంత్రి కన్నబాబు. అర్భీకేలు బలమైన వ్యవస్థగా రూపాంతరం చెందుతున్నాయి. ఎఫ్ఏఓ, ఐసిఏఆర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అర్భీకేలకు గుర్తింపు లభించిందన్నారు మంత్రి. త్వరలోనే ఆర్గానిక్ పాలసీ తీసుకొని రాబోతున్నాం. అర్భీకేల ద్వారా ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రక్రియ ఉంటుంది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఎక్కడ ఇబ్బందులు లేవు. వర్షాలు వరదల వల్ల ధాన్యం రంగు మారింది. రైతులను అన్ని విధాలుగా…
ధాన్యం సేకరణపై కేంద్రంపై యుద్ధం ప్రకటించిన అధికార టీఆర్‌ఎస్.. తదుపరి కార్యాచణ ఏంటి? తాటతీస్తాం.. మెడలు వంచుతామని చెప్పిన ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. మరి.. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు టీఆర్‌ఎస్ ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి? పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్‌ఎస్..! తెలంగాణలో వరి రైతుల ఇక్కట్లు ఎలా ఉన్నాయో.. ధాన్యం రాశుల దగ్గర చూస్తే తెలుస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లముందే వర్షం పాలై.. ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియక.. కొనుగోలు చేసేవారు…
తెలంగాణ వరి ధాన్యం కొనుగోలుపై రాద్ధాంతం నడుస్తోంది. బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ నేతల మాటల దాడి కొనసాగుతోంది. తాజాగా వరి ధాన్యం కొనుగోలుపై తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలయింది. పిల్ దాఖలు చేశాడు లా విద్యార్థి బొమ్మనగరి శ్రీకర్. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా ఉండడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని…
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఆందోళన చేస్తూ వస్తున్న తెలంగాణ ఎంపీలు.. ఇవాళ లోక్‌సభ, రాజ్యసభలో ఈ విషయాన్ని లేవనెత్తారు.. లోక్‌సభలో ధాన్యం సేకరణపై మాట్లాడిన ఎంపీ నామా నాగేశ్వరరావు.. తెలంగాణ రైతుల ధాన్యం సేకరణ గురించి గత ఐదు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నామని తెలిపారు.. తెలంగాణలో రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంటు ఇస్తున్నాం.. రైతు బంధు ఎకరానికి 10 వేలు ఇస్తున్నాం.. కాళేశ్వరం ప్రాజెక్టు…
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం కూడా లోక్‌సభ, రాజ్యసభల్లో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ప్రకటన చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. లోక్‌సభలో ప్లకార్డులను ముక్కలు ముక్కలుగా చింపి విసిరేసి నిరసన తెలియజేశారు. వరి కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కేంద్రాన్ని నిలదీశారు. ఐదు రోజులుగా తెలంగాణ రైతుల గురించి తాము ఆందోళన చేస్తున్నామని, తెలంగాణలో వరి ధాన్యం కొంటారా? కొనరా? అనే విషయంపై కేంద్ర…
ఆశతో హస్తినకు వచ్చాం.. కానీ, కేంద్ర ప్రభుత్వం నిరాశపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి… కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. యాసంగిలో వరి వేయొద్దని కేంద్రం గట్టిగా చెప్పిందని తెలిపారు. మేం ఎంతో ఆశతో వచ్చాం.. కానీ, కేంద్రం నిరాశపరిచిందన్న ఆయన.. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించాం.. కానీ, నిరాశే మిగిలిందన్నారు. కేంద్రమంత్రితో జరిగిన సమావేశంలో.. కేంద్రం ఎంత…
వడ్లు కొనుగోలు వ్యవహారంలో గత కొంత కాలంగా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది.. కేంద్రం చెప్పేది ఒక్కటైతే.. రాష్ట్ర నేతలు మాత్రం రైతులను తప్పుదోవపట్టిస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తుంటే.. కేంద్రం స్పష్టంగా చెప్పినా.. టీఆర్ఎస్ ప్రభుత్వమే డ్రామా చేస్తుందని బీజేపీ విమర్శిస్తుందో.. ఇక, దీనిపై మరింత క్లారిటీ కోసం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రుల బృందానికి నిరశే ఎదురైంది.. తెలంగాణలో యాసంగిలో పండించే వడ్ల కొనుగోలుపై కేంద్రం నిరాశే మిగిల్చింది. యాసంగి వడ్లను కొనేందుకు కేంద్రం…
సీఎం కేసీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలు అంశంలో కేసీఆర్ సర్కార్ పై ఆమె మండిపడ్డారు. ఢిల్లీ రాజకీయాలు చేసే దొరగారికి ఇక్కడి రైతుల చావులు, నేతన్నల ఆత్మహత్యలు కనిపించడం లేదంటూ నిప్పులు చెరిగారు. పెట్టిన పెట్టుబడి రాక, పండిన పంట కళ్ళ ముందు కొట్టుకుపోతుంటే, అప్పులు తీరక గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్ గారికి మాత్రం కనిపించడం లేదని ఆగ్రహించారు వైఎస్ షర్మిల. దొరా.. పంటలు కొనండి అని గుండెలు ఆగేలా…