యాసంగి వడ్లపై కేంద్రం క్లారిటీ.. తెలంగాణకు నిరాశ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వడ్లు కొనుగోలు వ్యవహారంలో గత కొంత కాలంగా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది.. కేంద్రం చెప్పేది ఒక్కటైతే.. రాష్ట్ర నేతలు మాత్రం రైతులను తప్పుదోవపట్టిస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తుంటే.. కేంద్రం స్పష్టంగా చెప్పినా.. టీఆర్ఎస్ ప్రభుత్వమే డ్రామా చేస్తుందని బీజేపీ విమర్శిస్తుందో.. ఇక, దీనిపై మరింత క్లారిటీ కోసం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రుల బృందానికి నిరశే ఎదురైంది.. తెలంగాణలో యాసంగిలో పండించే వడ్ల కొనుగోలుపై కేంద్రం నిరాశే మిగిల్చింది. యాసంగి వడ్లను కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ మంత్రుల బృందం నిరాశతోనే వెనుదిరగాల్సిన పరిస్థితి.
హస్తిన వెళ్లిన తెలంగాణ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డితో పాటు ఎంపీలు నామా నాగేశ్వర రావు, బీబీ పాటిల్, సురేశ్ రెడ్డి… కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా యాసంగిలో వరి ధాన్యం సేకరణపై చర్చించారు. కానీ.. కేంద్ర ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోలుపై సానుకూల నిర్ణయం రాలేదని చెబుతున్నారు మంత్రులు. కాగా, ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల మార్కెట్ యార్డులు, రోడ్లపై కూడా వరి ధాన్యం దర్శనమిస్తోంది.. కేంద్రం, రాష్ట్రం మధ్య వైరంతో కొనుగోళ్లలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు