తెలంగాణలో మరోసారి ధాన్యం కొనుగోలు వ్యవహారం తెరపైకి వచ్చింది. యాసంగిలో పండించిన ధాన్యం చివరి గింజ వరకు కేంద్రం కోనుగోలు చేయాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే గులాబి దళం మంత్రులు హస్తినకు చేరుకొని కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది. యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ప్రధానికి రాసిన లేఖలో…
Telangana Energy Minister Jagadish Reddy About Paddy Procurement. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం వెనకబాటుకు గురైందని, బీజేపీ పాలనలో దేశం తిరోగమనం చెందుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధి జరిగిందని, దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణలో సాగుతున్న సుభిక్షమైన పాలనను దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఆయన…
తెలంగాణ సర్కార్-కేంద్ర సర్కార్ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది.. యాసంగిలో పడించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో… తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీ చేరుకుంది. వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌లు… ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర మంత్రులను కలిసి… ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతామన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి. వన్ నేషన్-వన్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ రూపొందించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. Read Also: TS RTC: ఆర్టీసీకి…
తెలంగాణలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి. యాసంగిలో వరి సాగు తగ్గింది. కేసీఆర్ మాటలకు ఎవ్వరూ కూడా వరి సాగు చేయలేదు. కేంద్రం ధాన్యం కొనాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం రా రైస్ కొంటాం కానీ, బోయిల్డ్ రైస్ కొనమని చెప్తోంది. గత వానాకాలంలో మీరు చేసిన పని వల్ల రైతులు నష్టపోయారు.. గతంలో ప్రభుత్వం ధాన్యం కొనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది. ఇప్పుడు కూడా…
తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వాణిజ్య, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మరింత స్ఫష్టత ఇచ్చారు. యాసంగి సీజన్ లోనూ కచ్చితంగా తెలంగాణ నుండి రా రైస్ కొనుగోలు చేస్తామని ప్రకటించారు. రైతులను ఆదుకోవడం తమ కనీస బాధ్యతని పీయూష్ గోయల్ చెప్పారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంలో కేంద్రానికి సహకరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి…
తెలంగాణలో బియ్యం రాజకీయం బాగా పండుతోంది. కేంద్రం రైతుల పక్షం కాబట్టే 40 లక్షల టన్నుల బియ్యానికి అదనంగా మరో ఆరు లక్షల టన్నులు బియ్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు బీజేపీ శాసనాసభా పక్షం నేత రాజాసింగ్. కేంద్రం లేఖ రాయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం రైతుల పక్షాన ఎప్పుడూ ఉంటుంది. రాష్ట్ర మంత్రుల ఢిల్లీ పర్యటన అర్థం లేనిది. వాళ్లు ఢిల్లీ వెళ్లక…
కేసీఆర్ సర్కార్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆంధ్ర రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మానవ మృగాలుగా మారిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి బాహ్యమైన రాజకీయాలు చేస్తున్నారని… చట్టంలో మద్దతు ధర ఉన్న పంటకు రైతులకు రక్షణ ఉంటుందని పేర్కొన్నారు. యాసంగిలో వడ్లు వేయాలని.. ఎట్లా కొనడో చూద్దామని స్పష్టం చేశారు. వడ్లు కొనని వాడు కుర్చీ మీద ఎట్లా కూర్చుంటాడని ఫైర్ అయ్యారు. వండ్లు కొనకపోతే… టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని బొంద…
ధాన్యం కొనుగోళ్ల అంశం పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ వైఫల్యమని పీయూష్ గోయల్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రైతులకు టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు భ్రమలను కల్పిస్తోందని… కేంద్ర ప్రభుత్వ పరంగా రైతులకు భరోసా ఇస్తున్నామన్నారు. తప్పుడు సమాచారం నమ్మవద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. గత రబీ సీజన్ లో ఇచ్చిన హామీ మేరకు ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేయలేక పోయిందని ఆగ్రహించారు. అవసరం లేకపోయినా, ప్రత్యేక కేసుగా పరిగణించి, 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయల్డ్…
తెలంగాణలో వరిధాన్యం సమస్య వెనుక బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర వుందని మండిపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ మంత్రులు కొత్త డ్రామా ఆడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వైపు జనం చూస్తున్నారు కాబట్టి బీజేపీ-టీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయన్నారు. వరి ధాన్యం కొనుగోలు వెనుక బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ కుట్ర వుందని ఆరోపించారు జగ్గారెడ్డి. సీఎం కేసీఆర్ ఢిల్లీకి పోతేనే సమస్య పరిష్కారం కాలేదు. మంత్రులవల్ల ఏం అవుతుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రధాని…
వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చి కునేందుకు టీఆర్ ఎస్ సర్కార్ సన్నద్ధం అయింది. ఇందు లో భాగంగానే… ఇవాళ దేశ రాజధాని ఢిల్లీకి తరలివెళ్లింది తెలంగాణ మంత్రుల బృందం. అంతేకాదు… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీకి అపాయింట్ మెంట్ కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ ,ఎర్రబెల్లి దయాకర్ రావు , జగదీశ్వర్ రెడ్డి ,పువ్వాడ అజయ్…