ధాన్యం కొనుగోళ్లపై రాజ్యసభలో కీలక ప్రకటన చేసిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం కూడా లోక్‌సభ, రాజ్యసభల్లో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ప్రకటన చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. లోక్‌సభలో ప్లకార్డులను ముక్కలు ముక్కలుగా చింపి విసిరేసి నిరసన తెలియజేశారు. వరి కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కేంద్రాన్ని నిలదీశారు. ఐదు రోజులుగా తెలంగాణ రైతుల గురించి తాము ఆందోళన చేస్తున్నామని, తెలంగాణలో వరి ధాన్యం కొంటారా? కొనరా? అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని నామా నాగేశ్వరరావు కోరారు.
Read Also: హైదరాబాద్‌లో కొత్తగా ప్రారంభమైన 32 బస్తీ దవాఖానాలు
Also Read
మరోవైపు వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం ప్రకటన చేయాలని రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ కేకే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రబీ సీజన్‌లో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుందని… బాయిల్డ్ రైస్ కొంటారో లేదో చెప్పాలన్నారు. గత ఏడాది 94 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశారని… ఈ ఏడాది ఇప్పటివరకు 19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని ఆయన గుర్తుచేశారు. ఇంకా ఎంత కొనుగోలు చేస్తారో చెప్పాలన్నారు.
అయితే దీనికి సమాధానంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. ధాన్యం కొనుగోలుపై ఇప్పుడేమీ స్పష్టంగా చెప్పలేమని.. ఖరీఫ్ సీజన్ ముగిసిన తర్వాతే యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై ఆలోచిస్తామని పీయూష్ గోయల్ తెలిపారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం చెప్పిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏటా వరి ధాన్యం కొనుగోళ్లను కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ వెళ్తుందన్నారు. ఈ ఏడాది కూడా తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోళ్లను పెంచుతామని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. వరి కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. ప్రస్తుత సీజన్‌లో అందివ్వాల్సిన బియ్యాన్నే తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేయలేకపోయిందని ఆయన చురకలు అంటించారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!