Bhatti Vikramarka : ఖమ్మం జిల్లాలో అధికారులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసేవపై కీలక వ్యాఖ్యలు చేశారు. సమావేశాన్ని చాలా ప్రత్యేకమైనదిగా పేర్కొన్న భట్టి, జిల్లాల ఇంచార్జి మంత్రులు అన్ని ప్రాంతాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. భట్టి ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్‌లో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కొనుగోలు చేసింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఇందులో ముందంజలో ఉన్నాయని కొనియాడారు. ఇకపై ధరలు చెల్లింపులు వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో 2–3 నెలలు ఆలస్యం అయ్యేదని గుర్తుచేశారు.
Tiktok : టిక్‌టాక్‌పై అమెరికా యూ-టర్న్, భారత్ నో-టర్న్..!
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో దేశంలో ఎక్కడ లేనంతగా ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల మేర శాంక్షన్ చేయడం గర్వకారణంగా పేర్కొన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించడం గొప్ప ముందడుగని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,56,000 ఇళ్లకు నిర్మాణాలు ప్రారంభించినట్లు తెలిపారు. కొన్ని చిన్నపాటి పొరబాట్లు మినహా ఈ మంచి కార్యక్రమాన్ని చెడుగా మలచకూడదని అధికారులకు సూచించారు.
భూ హక్కులపై ప్రభుత్వ దృష్టిని స్పష్టం చేసిన భట్టి, “భూ భారతి పథకాన్ని 10 ఏళ్లు చూశాం. ధరణి ద్వారా ప్రజలకు సరళమైన, న్యాయమైన హక్కులు లభించాయి. దాన్ని తొలగిస్తామని ఎన్నికల హామీ ఇచ్చాం. దానిని అమలుచేయడంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కసరత్తు చేస్తున్నారు” అని చెప్పారు.
విత్తనాల పంపిణీ సక్రమంగా జరగాలని, నకిలీ విత్తనాలపై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. తాగునీరు లీకేజీలపై శ్రద్ధ వహించాలని, ఆసుపత్రుల్లో సేవలు మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. “గతంలో ప్రభుత్వాలు విభాగాలను గాలికి వదిలేశాయి. కానీ ప్రస్తుతం బడ్జెట్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు, నిధులు విడుదల చేస్తాం” అన్నారు. “10 ఏళ్లు వెనుకపడ్డాం. ఇప్పుడు పరుగులు పెట్టక తప్పదు. లక్ష్యాలను చేరుకోవాలంటే ఇదే మార్గం” అంటూ భట్టి స్పష్టమైన సందేశం ఇచ్చారు.
Illegal Affair : భర్త అన్నతో హనీమూన్.. ఆ పనిచేస్తుండగా దొరికేసిన భార్య