రాబోయే ఐదు రోజుల్లోనే రైతులకు ధాన్యం కొనుగోలుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో పాల్గొన్న రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 16 లక్షల మంది లబ్ధిదారులని పొందుపరిచామని వెల్లడించారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల ఆరువేల పైచిలుకు రేషన్ కార్డులు పంపిణీ చేశామని చెప్పారు. సున్నా వడ్డీతో 65 లక్షల మంది మహిళలకు రూ. 25 వేల కోట్ల రుణాలు ఇచ్చామని చెప్పారు.
READ MORE: AP Crime News: కోనసీమ జిల్లాలో దారుణం.. 10వ తరగతి విద్యార్థిని గర్భవతి! కరస్పాండెంట్‌పై పోక్సో కేసు
గతంలో డ్వాక్రా గ్రూప్ సభ్యురాలుగా 18 సంవత్సరాలు ఉన్న మహిళలకు మాత్రమే అవకాశం ఇచ్చేవారని.. 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు అవకాశం ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 18 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలకే తగ్గిస్తూ 60 సంవత్సరాల వయసుని 65వ సంవత్సరాలకు పెంచుతూ జీవో ఇచ్చిందని తెలిపారు. కోటి మంది మహిళలని కోటీశ్వరులు చేయటమే మన ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఉచిత బస్సు ప్రయాణానికి ఐదువేల కోట్లు అదనంగా ఖర్చు చేస్తూ భారంగా భావించటం లేదని.. ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత తనదన్నారు. పేదల ఇంటి పెద్ద కొడుకులా తాను ప్రజలతో ఉంటానని హామీ ఇచ్చారు.
READ MORE: US-India Trade: ట్రంప్ సంచలన ప్రకటన.. ఆగస్టు 1 నుంచి భారత్‌పై 25% సుంకాలు..