Nadendla Manohar : ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు చెల్లించాల్సిన బకాయిలను విస్మరించారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రైతుల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ, అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,674 కోట్ల మేర బకాయిలను వెంటనే చెల్లించామని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 5.65 లక్షల మంది రైతుల నుంచి 35.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇందుకు గాను రూ.8,277.59 కోట్లను కేవలం 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి జమ చేశామని వెల్లడించారు.
Dilraju : శ్రీవారి పేరుతో ఏఐ స్టూడియో లాంచ్ చేసిన దిల్ రాజు..
అదే విధంగా ప్రస్తుత రబీ సీజన్‌లో 1.16 లక్షల మంది రైతుల నుంచి 12.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి, రూ.2,722.81 కోట్లను వెంటనే చెల్లించినట్లు వివరించారు. రైతులకు తక్షణమే న్యాయం చేయాలనే దృష్టితో సత్వర చెల్లింపుల విధానాన్ని పాటిస్తున్నామని చెప్పారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అన్నదాతల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా తీసుకొని పనిచేస్తోందని, గత ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దడమే తమ బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
Pakistan: బలూచిస్తాన్‌లో బీఎల్ఏ ధమాకా.. 22 మంది పాక్ సైనికుల హతం..