India Pakistan: సరిహద్దు దాటేందుకు పాక్ జాతీయుడి యత్నం.. కాల్చి చంపిన బీఎస్ఎఫ్.
- పంజాబ్‌లో సరిహద్దు దాటేందుకు పాక్ జాతీయుడి యత్నం..
- కాల్చి చంపిన బీఎస్ఎఫ్ దళాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం పంజాబ్ ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) దాటేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ జాతీయుడిని బీఎస్ఎఫ్ కాల్చి చంపింది. భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని గురువారం బీఎస్ఎఫ్ హతమార్చింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) ప్రకారం, చొరబాటుదారుడు రాత్రి సమయంలో సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు గమనించారు. బీఎస్ఎఫ్ దళాలు వార్నింగ్ ఇచ్చినప్పటికీ, ఆ వ్యక్తి బోర్డర్ దాటేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరిపారు.
Read Also: Baglihar Dam: చీనాబ్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేసిన భారత్.. పాకిస్తాన్‌లో భయం భయం..
Also Read
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్, పీఓకే భూభాగాల్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే ఈ చొరబాటు ప్రయత్నం జరిగింది. ఈ
వారం ప్రారంభంలో కూడా ఇలాగే ఓ పాకిస్తానీయుడు పంజాబ్ గురుదాస్‌పూర్ జిల్లాలో భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. అతడిని బీఎస్ఎఫ్ అరెస్ట్ చేసింది. ఆ వ్యక్తిని మహ్మద్ హుస్సేన్‌గా గుర్తించారు. అప్పటి నుంచి అతను పంజాబ్ పోలీసులు కస్టడీలో ఉన్నాడు. అతడి వద్ద నుంచి పాక్ కరెన్సీ, పాక్ గుర్తింపు కార్డు స్వాధీనం చేసుకున్నారు. దీనికి ముందు రాజస్థాన్ సరిహద్దుల్లో ఇలాగే ఓ పాక్ రేంజర్ సరిహద్దు దాటేందుకు ప్రయత్నించడంతో మన భద్రతా బలగాలు అతడిని అరెస్ట్ చేశాయి. ఇతను గూఢచర్యం కోసం ప్రవేశించి ఉండొచ్చని ప్రాథమిక విచారణలో తేలింది.
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!