భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని గంటల తర్వాత పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. శ్రీనగర్ మీదుగా పెద్ద ఎత్తున డ్రోన్ కార్యకలాపాలు జరిగినట్లు సమాచారం. శ్రీనగర్‌లో జరిగిన డ్రోన్ దాడి వీడియోను జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా షేర్ చేశారు. పాకిస్థాన్ భారీ షెల్లింగ్‌కు దిగిందని.. కొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు."ఇది కాల్పుల విరమణ కాదు. శ్రీనగర్ మధ్యలో ఉన్న వైమానిక రక్షణ విభాగాలు ఇప్పుడే తెరుచుకున్నాయి" అని సీఎం…
భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని అఖ్నూర్, రాజౌరి, ఆర్ఎస్ పురా సెక్టార్ల నుంచి ఫిరంగి దాడులు జరిగినట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్లో పాకిస్థాన్ డ్రోన్ కలకలం సృష్టించింది. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. భద్రతా దళాలు ఒక డ్రోన్‌ను కూల్చివేశాయి. జమ్మూలోని పలన్వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది.
పహల్గామ్ ఉగ్రదాడి భారత్‌ను భగ్గుమనేలా చేసింది. ఆపరేషన్ సిందూర్ కారణంగా భారత్ పాక్ మధ్య యుద్ధంలాంటి పరిస్థితి దాపురించింది. తాజాగా ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. ఈ సమాచారాన్ని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అందించారు. కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇంతలో పలువురు రాజకీయ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ అంశంపై మాట్లాడారు.
Celina Jaitly : ‘ఆపరేషన్ సిందూర్ ను పొగిడినందుకు తాజాగా ఓ హీరోయిన్ పై ట్రోల్స్ జరుగుతున్నాయి. వీటిపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పేది లేదని.. నా దేశాన్నే పొగుడుతా’ అంటూ చెప్పింది. ఆమె ఎవరో కాదు హీరోయమిన్ సెలీనా జైట్లీ. ఆమె ఆపరేషన్ సిందూర్ ను పొగుడుతూ చేసిన కామెంట్స్ పై కొందరు ట్రోల్స్ చేశారు. క్షమాపణ చెప్పాలని.. లేదంటే అన్ ఫాలో చేస్తామంటూ బెదిరించారు. వీటిపై ఆమె స్పందిస్తూ.. ‘మీరేం…
Operation Sindoor Live Updates: సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు, క్షిపణులతో పాకిస్తాన్ దాడి చేయడంతో.. భారత్ గట్టిగా ప్రతిస్పందించింది. ఆ దేశంలోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై దాడి చేసింది.
IND PAK War: ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో.. దేశ రాజధాని ఢిల్లీలో నేడు ఓ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్షలు చేపట్టారు. ఈ భేటీలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ అధికారులతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ లు సమావేశంలో పాల్గొన్నారు. వీరందరూ దేశ భద్రతకు సంబంధించి…
Operation Sindoor: ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో అప్రమత్తత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సెలవుల్లో ఉన్న భారత జవాన్లను వారి విధుల్లోకి తిరిగి రావాలని ఆర్మీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీనితో వెంటనే ఆర్మీ సైనికులు కుటుంబాలను వదిలి తిరిగి సరిహద్దుల వైపు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన మనోజ్ పాటిల్ అనే భారత సైనికుడి పరిస్థితి ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి…
Terrorists Killed: ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన దాడుల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన అబు జిందాల్, హఫీజ్ ముహమ్మద్ జమీల్, యూసుఫ్ అజార్, అబు ఆకాషా, మహ్మద్ హసన్ ఖాన్ హతమయ్యారని భారత భద్రతా దళాలు ప్రకటించాయి.
India Pak War : పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ తన దుశ్చర్యలను కొనసాగిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. శనివారం ఉదయం నుంచే జైసల్మేర్ వ్యాప్తంగా పోలీసులు, ఆర్మీ అప్రమత్తమయ్యారు. నగరమంతా ఖాళీ చేయిస్తున్నారు. భయానక సైరన్ల మోతతో జైసల్మేర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జైసల్మేర్‌కు కేవలం 6 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గిడా గ్రామంలో పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్స్‌ను భారత ఆర్మీ సమర్థవంతంగా కూల్చివేసింది. అయితే ముప్పు ఇంకా పొంచి ఉందన్న హెచ్చరికలతో…
భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ కొనసాగిస్తోంది. మే 7 రాత్రి పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ప్రదేశాలలో వైమానిక దాడులు చేసి లష్కరే, జైషే, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసిన తరువాత, భారత సైన్యం ఇప్పుడు సరిహద్దుకు సమీపంలో ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను నాశనం చేయడం ప్రారంభించింది. ఉగ్రవాద స్థావరాల ధ్వంసానికి సంబంధించిన కొత్త వీడియోను భారత సైన్యం విడుదల చేసింది. ఈ వీడియో నేపథ్యంలో ‘కదం కదం బధయే జా,…