Operation Sindoor:‘ఆపరేషన్ సిందూర్’’ ఘటన అనంతరం తొలిసారిగా భారత త్రివిధ దళాలు మీడియా సమావేశంలో పాల్గొన్నాయి. ఈ సమావేశంలో భారతదేశ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ డీజీఎంఓ పాల్గొని అనేక ప్రశ్నలకు సమాధానాలను తెలిపారు. ఈ కీలక సమావేశంలో భారత్ పాకిస్తాన్ కు హెచ్చరిక జారీ చేసింది. అమెరికా దేశ మధ్యవర్తంగా శనివారం సాయంత్రం ఇరు దేశాల మధ్య ఏర్పడిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్తాన్ ఉల్లంఘనల పట్ల భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, ఈ విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంగిస్తే గట్టి ప్రతీకారం తప్పదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read Also: India Pakistan War: ఎయిర్ బేస్‌లపై దాడితో పాకిస్తాన్‌లో భయం.. ఆ తర్వాతే చర్చల ప్రతిపాదన..
ఈ సమావేశంలో సైనిక విభాగం ముఖ్య అధికారి లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ.. శనివారం మధ్యాహ్నం 3.35కు తాను పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌ను హాట్‌లైన్ ద్వారా సంప్రదించారని చెప్పారు. ఆ సమయంలో అటు సరిహద్దు వెంట, ఇటు గగనతలంలో జరిగే దాడుల్ని ఆపాలని నిర్ణయించాం. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకల్లా అవన్నీ ఆగిపోయాయని ఆయన వివరించారు. అయితే, అనుకున్న విధంగానే పాకిస్తాన్ కొన్ని గంటలకే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆయన అన్నారు.
Read Also: Operation Sindoor: భారత సైన్యం కాల్పుల్లో దాదాపు 40 మంది పాక్ సైనికుల మృతి..
ఈ నేపథ్యంలో పాక్ దాడులు మళ్లీ మొదలయ్యాయని.. డ్రోన్ ఉల్లంఘనలు జమ్మూ కశ్మీర్‌తో పాటు గుజరాత్‌లోనూ జరిగాయని ఆయన తెలిపారు. ఇవన్నింటికీ భారత్ తగిన విధంగా స్పందించిందని లెఫ్టినెంట్ జనరల్ ఘాయ్ తెలిపారు. ఈ ఘటనల నేపథ్యంలో పాకిస్తాన్‌కు మరోసారి హాట్‌లైన్ సందేశం పంపినట్లు తెలిపారు. ఇలాంటి ఉల్లంఘనలు మళ్లీ జరుగితే తీవ్ర ప్రతీకారం తప్పదనే సందేశాన్ని ఆయన స్పష్టంగా తెలియజేశారు. భారత ఆర్మీ చీఫ్ ఇప్పటికే తమ దళాలకు పూర్తి అధికారాన్ని ఇచ్చినట్లు ఆయన తెలిపారు.