భారత్ తో యుద్ధంలో తాము విజయం సాధించామని తెలిపారు. మా దేశాన్ని, మా పౌరులను రక్షించుకోవడానికి తాము ఏం చేసేందుకు అయినా వెనుదిరిగేది లేదన్నారు. పాకిస్తాన్ ను ఎవరైనా సవాల్ చేస్తే వారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని పాక్ ప్రధాని చెప్పుకొచ్చారు.
పంజాబ్ అమృత్‌సర్‌లో హైఅలర్ట్ కొనసాగుతోంది. ప్రభుత్వం మరోసారి ప్రజలకు కీలక సూచనలు చేసింది. చాలా జాగ్రత్తగా ఉండాలని.. దయచేసి ఇళ్లలో లైట్లు ఆపి, కిటికీలకు దూరంగా ఇంటి లోపల ఉండాలని సూచించింది. దయచేసి రోడ్డు, బాల్కనీ లేదా టెర్రస్‌పైకి వెళ్లవద్దని తెలిపింది. భయపడవద్దని.. సాధారణ కార్యకలాపాలను ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తామో తెలియజేస్తామని ప్రకటించింది. ఈ సమాచారాన్ని అమృత్సర్ డీసీ ఉదయం 4.39 గంటలకు జారీ చేసిన మార్గదర్శకంలో తెలిపింది.
శనివారం ఉదయం భారత్‌లోని అనేక ప్రాంతాలలో పాకిస్థాన్ డ్రోన్ దాడులను నిర్వహించింది. జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ఉన్న వైమానిక దళ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే.. భారత సైన్యం, రక్షణ వ్యవస్థ శత్రు డ్రోన్‌ను గాల్లోనే కూల్చివేశాయి. ఈ సమయంలో వైమానిక దళ స్టేషన్లో విధుల్లో ఉన్న ఒక సైనికుడు వీరమరణం పొందాడు. పాకిస్థాన్ డ్రోన్ ముక్కను ఢీకొట్టడంతో అమరుడయ్యారు.
భారతదేశం, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతకు సంబంధించి చైనా ప్రకటన వెలువడింది. పాకిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో తాము అండగా నిలుస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ అన్నారు. ఈ మేరక తాజాగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ ఫోన్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో చైనా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వాంగ్‌యీకు పాక్ మంత్రి వివరించినట్లు విదేశాంగశాఖ కార్యాలయం…
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని.. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. సరిహద్దు పొడవునా పాక్ ఉల్లంఘనలకు పాల్పడిందని వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని. ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. కాల్పుల విరమణ ఉల్లంఘనపై తక్షణ చర్యలు తీసుకోవాలని పాక్‌కు సూచించినట్లు వెల్లడించారు. సైన్యం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని, కఠిన చర్యలు తీసుకోవాలని సూచనలు ఇచ్చామన్నారు. కొన్ని గంటలుగా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని చెప్పారు.…
గుజరాత్‌లోని కచ్‌లో పాకిస్థాన్ డ్రోన్లు కనిపించాయని రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘ్వీ అన్నారు. "కచ్ జిల్లాలో అనేక డ్రోన్లు కనిపించాయి. ఇప్పుడు పూర్తిగా బ్లాక్అవుట్ అమలు చేయబడింది. దయచేసి సురక్షితంగా ఉండండి, భయపడవద్దు" అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా.. ఈ ప్రాంతంలో పాకిస్థాన్ డ్రోన్స్ ప్రయోగిస్తోందని చెబుతున్నారు. ఈ దాడులకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు.. ఈ దాడిని భద్రతా దళాలు ఇంకా…
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతను పరిష్కరించడానికి అమెరికా మధ్యవర్తిత్వంలో ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. అయితే.. కాల్పుల విరమణ ప్రకటించిన నాలుగు గంటల తర్వాత.. పాకిస్థాన్ సైన్యం మళ్లీ భారత్‌లోని పలు ప్రాంతాల్లో దాడులకు దిగినట్లు తెలుస్తోంది. తాజాగా జమ్మూ కశ్మీర్లో పాక్ డ్రోన్ దాడులకు తెగబడుతున్నట్లు సమాచారం.
భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని గంటల తర్వాత పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. శ్రీనగర్ మీదుగా పెద్ద ఎత్తున డ్రోన్ కార్యకలాపాలు జరిగినట్లు సమాచారం. శ్రీనగర్‌లో జరిగిన డ్రోన్ దాడి వీడియోను జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా షేర్ చేశారు. పాకిస్థాన్ భారీ షెల్లింగ్‌కు దిగిందని.. కొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు."ఇది కాల్పుల విరమణ కాదు. శ్రీనగర్ మధ్యలో ఉన్న వైమానిక రక్షణ విభాగాలు ఇప్పుడే తెరుచుకున్నాయి" అని సీఎం…
భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని అఖ్నూర్, రాజౌరి, ఆర్ఎస్ పురా సెక్టార్ల నుంచి ఫిరంగి దాడులు జరిగినట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్లో పాకిస్థాన్ డ్రోన్ కలకలం సృష్టించింది. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. భద్రతా దళాలు ఒక డ్రోన్‌ను కూల్చివేశాయి. జమ్మూలోని పలన్వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది.
పహల్గామ్ ఉగ్రదాడి భారత్‌ను భగ్గుమనేలా చేసింది. ఆపరేషన్ సిందూర్ కారణంగా భారత్ పాక్ మధ్య యుద్ధంలాంటి పరిస్థితి దాపురించింది. తాజాగా ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. ఈ సమాచారాన్ని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అందించారు. కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇంతలో పలువురు రాజకీయ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ అంశంపై మాట్లాడారు.