Salman Khurshid: ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదని పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి, లేకుంటే ఎన్ని చర్చలు జరిపినా ఆశించిన ఫలితం రాదని స్పష్టం చేశారు భారత మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్.. ఇప్పుడు భారత్ జాగ్రత్తగా ఉండాలన్నారు.. ఆపరేషన్ సిందూర్‌లో భాగస్వాములైనమా అధికారులకు సెల్యూట్ చేయండి, వారిని చూస్తే గర్వంగా ఉంది.. సాయుధ దళాలు అద్భుతమైన నిర్ణయాలతో విజయం సాధించాయి అంటూ ఆపరేషన్ సిందూర్‌పై ప్రశంసలు కురిపించారు.. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, ఖుర్షీద్ మాట్లాడుతూ.. మనం ఏమి చేసినా, మనం ఏమి చేరుకోవడానికి ప్రయత్నించినా.. చివరికి దానికి ఒక సారాంశం ఉంది.. అదే ఉగ్రవాదాన్ని లేకుండా చేయడమే అన్నారు ఖుర్షీద్.. ఇంకా ఏవైనా ఉగ్రవాద దాడులు జరిగితే యుద్ధ చర్యగా పరిగణిస్తామని.. తదనుగుణంగా వ్యవహరిస్తామని భారత్ ప్రకటించింది.. కానీ, యుద్ధ చర్యకు ప్రతిస్పందించడానికి కూడా పరిమితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు..
Read Also: Tri Series: సెంచరీతో చెలరేగిన స్మృతి మందాన.. ఫైనల్లో శ్రీలంక పై ఘన విజయం..!
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఆమోదయోగ్యం కాదని పాకిస్తాన్ స్పష్టమైన ప్రకటనతో అంగీకరించాలని డిమాండ్ చేశారు సల్మాన్ ఖుర్షీద్.. అది చేయకపోతే, పెద్దగా సాధించడానికి అవకాశం ఉందని నేను అనుకోను అన్నారు.. పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేసే సామర్థ్యాన్ని భారతదేశం ప్రపంచానికి తెలియజేసిందా? అని వేసిన ప్రశ్నకు సమాధానంగా.. ఇది చాలా సున్నితమైన అంశం.. ఉగ్రవాద నెట్‌వర్క్ కూల్చివేయబడిందని.. త్వరలో అది కనిపించదని భారతదేశం ఆలోచించగలదా అని ప్రశ్నించారు?.. అది చాలా ఆశాజనకంగా ఉంటుందని నేను భావిస్తున్నాను అన్నారు.. ఆపరేషన్ సిందూర్ లో ఉగ్రవాద స్థావరాలపై దాడుల సమయంలో లక్ష్యంగా చేసుకున్న తొమ్మిది ప్రదేశాలలో రెండు లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం మురిడ్కే, జైషే మొహమ్మద్ ప్రధాన స్థావరం భవల్పూర్ ఉన్నాయన్న ఆయన.. ఆపరేషన్ సిందూర్ తో భారతదేశం ప్రతీకారం తీర్చుకున్న తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణను ప్రకటించింది.. కానీ, కొన్ని గంటల్లోనే దానిని ఉల్లంఘించిందని ఫైర్ అయ్యారు భారత మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్.