Operation Sindoor: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ గురించి త్రివిధ దళాల సైనికాధికారులు మాట్లాడారు. భారత సైన్యం మే 7-10 మధ్య జరిపిన ప్రతీకార దాడుల్లో పాకిస్తాన్ సైన్యానికి చెందిన 35-40 మంది చనిపోయినట్లు మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ శనివారం చెప్పారు.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ తర్వాత తొలిసారిగా భారత త్రివిధ దళాలు మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ డీజీఎంఓ పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదులు, వారి మద్దతుదారుల్ని టార్గెట్ చేస్తూ చేసినట్లు సైనికాధికారులు చెప్పారు.
ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదని పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి, లేకుంటే ఎన్ని చర్చలు జరిపినా ఆశించిన ఫలితం రాదని స్పష్టం చేశారు భారత మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్.. ఇప్పుడు భారత్ జాగ్రత్తగా ఉండాలన్నారు.. ఆపరేషన్ సిందూర్‌లో భాగస్వాములైనమా అధికారులకు సెల్యూట్ చేయండి, వారిని చూస్తే గర్వంగా ఉంది.. సాయుధ దళాలు అద్భుతమైన నిర్ణయాలతో విజయం సాధించాయి అంటూ ఆపరేషన్ సిందూర్‌పై ప్రశంసలు కురిపించారు.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పాక్ వరుస క్షిపణి, డ్రోన్ దాడులను చేయగా.. దీనికి భారత సైన్యం దీటైన సమాధానం ఇచ్చింది. అయితే మే 8న జరిగిన దాడుల కారణంగా ధర్మశాలలో ఐపీఎల్ 2025 మ్యాచ్ కూడా ప్రభావితమైంది. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను మధ్యలో ఆపేసి.. రద్దు చేశారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో బాలీవుడ్…
PM Modi:పాకిస్తాన్ చర్చల్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) తిరిగి పొందడం, ఉగ్రవాదుల అప్పగించపై మాత్రమే ఉంటుందని భారత్ అమెరికాకు స్పష్టం చేసింది. "కాశ్మీర్ విషయంలో మాకు చాలా స్పష్టమైన వైఖరి ఉంది, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) తిరిగి రావడం అనే ఒకే ఒక విషయం మిగిలి ఉంది.
PM Modi: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో శనివారం అంతర్జాతీయ సమాజం ఆందోళన మేరకు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిరింది. రెండు దేశాల మధ్య తాము మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాలతో సుదీర్ఘం మాట్లాడి కాల్పుల విమరణకు ఒప్పించినట్లు ఆయన ప్రకటించారు.
China: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పీఓకే ప్రాంతాల్లోని తీవ్రవాద క్షేత్రాలపై దాడులు నిర్వహించింది. దీని తర్వాత, భారత్‌పైకి డ్రోన్లు, క్షిపణులతో పాకిస్తాన్ దాడి చేసింది.
కొత్త పోప్‌గా బాధ్యతలు తీసుకున్న పోప్ లియో XIV, అమెరికా కార్డినల్ రాబర్ట్ ప్రెవోస్ట్ ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను స్వాగతించారు. శాశ్వత శాంతి కోసం ఆశిస్తున్నట్లు ప్రకటించారు.
Operation Sindoor: పాకిస్తాన్ డ్రోన్ దాడి కారణంగా ఒక సైనికుడు అమరుడయ్యారు. డ్రోన్‌ని అడ్డగించిన సమయంలో దాని శకలాల్లో ఒకటి బలంగా తాకడంతో జవాన్ మరణించినట్లు అధికారులు తెలిపారు. శనివారం, జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలోని వైమానిక స్థావరంలో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డ్రోన్‌ని విజయవంతంగా అడ్డగించింది. అయితే, డ్రోన్ శిథిలాలు సురేంద్ర సింగ్ మోగ అనే సైనికుడిని బలంగా ఢీకొట్టాయి. దీంతో తీవ్రగాయాలైన అతను మరణించాడు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో సురేంద్ర సింగ్ విధుల్లో…
BrahMos: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్‌లోని పలు ఉగ్రవాద స్థావరాలపై భీకర దాడులు చేసింది. ఈ దాడిలో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయాలతో పాటు వాటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది.