పాకిస్థాన్ అణ్వస్త్ర బ్లాక్‌మెయిల్‌కు భారత్ భయపడదని.. అలాంటి బెదిరింపులను ఏ మాత్రం సహించబోమని ప్రధాని మోడీ దాయాది దేశాన్ని హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి 22 నిమిషాల పాటు ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు మూడు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు భద్రతా సిద్ధాంతాన్ని మోడీ వివరించారు.
మొదటి హెచ్చరిక:
భారత్‌పై జరిగే ఏ ఉగ్రవాద దాడికైనా ఈసారి బలమైన మరియు దృఢమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. భారత్ సొంత సామర్థ్యం మేరకే ప్రతీకారం తీర్చుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాద కేంద్రాలను, వారి మూలాలపై భారత్ లక్ష్యంగా చేసుకుంటుందని పేర్కొన్నారు.
రెండో హెచ్చరిక:
భారతదేశం అణు బెదిరింపులకు భయపడదన్నారు. అలాంటి బెదిరింపులతో ఎలాంటి ఉగ్ర దాడులకు పాల్పడినా తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.
మూడో హెచ్చరిక:
ఉగ్రవాదానికి, వారికి ఆశ్రయం కల్పిస్తున్న ప్రభుత్వాలను ప్రత్యేకంగా చూడబోమన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో ఉగ్రవాదులు చనిపోతే.. వారి అంత్యక్రియలకు బహిరంగంగా పాకిస్థాన్ సైనిక అధికారులు హాజరు కావడం ప్రపంచమంతా చూసిందని తెలిపారు. అంటే ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఎంత సపోర్టుగా ఉంటుందో దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: పాక్‌తో చర్చలు జరిగితే ఇకపై ఉగ్రవాదం.. పీవోకేపైనే
21వ శతాబ్ధంలో మేక్ ఇన్ ఇండియా తయారు చేసిన ఆయుధాలనే పాకిస్థాన్‌పై ప్రయోగించినట్లు ప్రధాని మోడీ అన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌తో చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై పాకిస్థాన్‌పై చర్చల అంశం వస్తే.. ఉగ్రవాదం, పాకిస్థాన్ ఆక్రమిత కార్మీర్(పీవోకే)పైనే జరుగుతాయని తేల్చి చెప్పారు. ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి జరగవన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: భారత్ ‘‘న్యూక్లియర్’’ బ్లాక్‌మెయిల్‌ని సహించదు.. పాక్‌కి మోడీ స్ట్రాంగ్ వార్నింగ్..