భారత్-పాకిస్థాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు చెప్పారు. ఇరు దేశాల మధ్య అణు యుద్ధాన్ని తానే ఆపానన్నారు. లేదంటే లక్షలాది మంది ప్రాణాలు పోయేవన్నారు. అణు యుద్ధం జరిగి ఉంటే పెను ప్రమాదం సంభవించేదని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరింత బలోపేతం చేస్తానని ట్రంప్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Trivikram Srinivas : నేను ‘సినివెన్నెల’పై కోప్పడ్డాను.. త్రివిక్రమ్ సంచలనం..
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ సోమవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అయితే ప్రెస్‌మీట్‌కు ముందు ప్రధాని మోడీ.. సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులు, సైనిక అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం అయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత వేర్వేరు సందర్భాల్లో మోడీ మాట్లాడారు. కానీ ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రసంగించడం మాత్రం ఇదే తొలిసారి.
ఇది కూడా చదవండి: PM Modi: ప్రెస్‌మీట్‌కు ముందు సీనియర్ మంత్రులతో మోడీ కీలక సమావేశం