21వ శతాబ్ధంలో మేక్ ఇన్ ఇండియా తయారు చేసిన ఆయుధాలనే పాకిస్థాన్‌పై ప్రయోగించినట్లు ప్రధాని మోడీ అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత సోమవారం తొలిసారి జాతినుద్దేశించి మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌తో చర్చలపై కీలక వ్యాఖ్యల చేశారు. ఇకపై పాకిస్థాన్‌పై చర్చల అంశం వస్తే.. ఉగ్రవాదం, పాకిస్థాన్ ఆక్రమిత కార్మీర్(పీవోకే)పైనే జరుగుతాయని తేల్చి చెప్పారు. ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి జరగవన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: భారత్ ‘‘న్యూక్లియర్’’ బ్లాక్‌మెయిల్‌ని సహించదు.. పాక్‌కి మోడీ స్ట్రాంగ్ వార్నింగ్..
‘‘ఈ రోజు(సోమవారం) బుద్ధ పూర్ణిమ. బుద్ధుడు మనకు శాంతి మార్గాన్ని ప్రబోధించాడు. ఆపరేషన్ సిందూర్ ఒక పేరు కాదు.. ఒక ఆవేదన. ఉగ్రవాదులు చనిపోతే పాక్ ఆర్మీ కన్నీళ్లు పెట్టుకుంది. దీని బట్టి ఉగ్రవాదులను పాక్ ఎలా పెంచి పోషిస్తుందో అర్థమవుతోంది. ఇది యుద్ధాల యుగం కాదు.. అలాగే ఉగ్రవాదుల యుగం కూడా కాదు.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని స్పష్టంగా చెప్పాం’’. అని మోడీ అన్నారు.
ఇది కూడా చదవండి: Minister Ponnam: చర్చలు లేకుండా ఒక ట్విట్టర్ పోస్టుతో యుద్ధ విరమణ ప్రకటిస్తే ఎలా..?