PM Modi: ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. మహిళల సిందూరాన్ని దూరం చేస్తే ఏమవుతుందో అనే విషయాన్ని పాకిస్తాన్‌కి తెలియజేశామని, పహల్గామ్ దాడిని ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరాటానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలిపారు. అదే విధంగా, పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఏదో రోజు అంతమవుతుందని, ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తేనే ఆ దేశ మనుగడ కొనసాగుతుందని చెప్పారు.
Read Also: PM Modi: సింధూరం తొలగిస్తే ఏమవుతుందో పాకిస్తాన్కి చూపించాం..
పాకిస్తాన్ చర్యల్ని బట్టి మన స్పందన ఉంటుందని చెప్పారు. త్రివిధ దళాలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్తాన్‌కి కొత్త తరహా జవాబు ఇచ్చామని అన్నారు. ఉగ్రవాదులు దాడులు చేస్తే ఇక మీదట ఇదే రిపీట్ అవుతుందని అన్నారు. ఇది యుద్ధాల యుగం కాదు, అలాగే ఉగ్రవాద యుగం కాదని ప్రధాని మోడీ అన్నారు.