ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి రాయ్‌పూర్-బలోదబజార్ రోడ్డులోని సారగావ్ సమీపంలో ఒక టిప్పర్, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. మృతుల్లో 9 మంది మహిళలు, ఇద్దరు బాలికలు, ఒక టీనేజర్, 6 నెలల శిశువు ఉన్నారు. మృతులందరూ ఛత్తీస్‌గఢ్‌లోని చటౌడ్ గ్రామానికి చెందిన వారిగా…
After Ceasefire: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన రెండు రోజుల తరువాత జమ్మూ కశ్మీర్ సహా అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొన్నదని భారత సైన్యం వెల్లడించింది. గత కొన్ని రోజులుగా తీవ్ర కాల్పుల మధ్య గడిపిన తరువాత, శనివారం సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చిన ఒప్పందం ఫలితంగా గత రాత్రి ప్రశాంతంగా గడిచిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో…
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పైక్ పై ఆపరేషన్ సింధూర్ ప్రకటించింది. మే 7న పాక్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన అనేక మంది పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, సిబ్బందిని చూపించే వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారత సాయుధ దళాలు అంత్యక్రియలకు హాజరైన పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది, పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన కీలక పోలీసు…
Operation Sindoor: “ఆపరేషన్ సింధూర్” తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాలలో ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే, అమెరికా మధ్యవర్తిత్వం వహింపుతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు సమ్మతించాయి. అయితే, ఈ కాల్పుల విరమణ చేపట్టిన కొద్ది సేపటికే పాకిస్తాన్ మరోమారు తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఆ దాడులను తిప్పికోట్టింది. ఇకపోతే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత బోలెడు అబ్దాలు చెప్పింది. ఆ అబద్దాలను భారత సైన్యం ఆధారాలతో సహా నిరూపించింది.…
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు జవాన్లు అమరులైనట్లు వెల్లడించారు DGMO రాజీవ్ ఘాయ్.. ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలపై తొలిసారి ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ DGMOలు సంయుక్త మీడియా సమావేశం.. నిర్వహించారు.. అందులో DGMO రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు సైనికులు అమరులయ్యారు.. ఐదుగురు జవాన్లు, పాక్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పౌరులకు సంతాపం తెలియజేస్తున్నాం.. అమర జవాన్ల త్యాగాలను దేశం ఎన్నటికీ మర్చిపోదు అన్నారు..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌కి చెందిన ఫైటర్ జెట్లను భారత్ కూల్చివేసినట్లు ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్(డీజీఏం) ఆదివారం తెలిపారు. ఫైటర్ జెట్లు ఏ జనరేషన్ అని ఖచ్చితంగా చెప్పకున్నా, హైటెక్ ఫైటర్ జెట్లను కూల్చేసినట్లు తెలిపారు. పాక్ విమానాలు మన సరిహద్దుల్లోకి ప్రవేశించకుండా నిరోధించామని,
Indian Navy: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ జరిపిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి ఈ రోజు త్రివిధ దళాల అధికారులు మీడియాకు వెల్లడించారు. ఉగ్రదాడి తర్వాత అరేబియన్ సముద్రంలో భారత నేవీని మోహరించినట్లు వెల్లడించారు. కరాచీతో సహా సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను చేధించేందుకు పూర్తి సామర్థ్యం కలిగి ఉన్నట్లు నేవీ వైస్ అడ్మినరల్ ఎఎన్ ప్రమోద్ తెలిపారు.
Operation Sindoor:‘ఆపరేషన్ సిందూర్’’ ఘటన అనంతరం తొలిసారిగా భారత త్రివిధ దళాలు మీడియా సమావేశంలో పాల్గొన్నాయి. ఈ సమావేశంలో భారతదేశ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ డీజీఎంఓ పాల్గొని అనేక ప్రశ్నలకు సమాధానాలను తెలిపారు. ఈ కీలక సమావేశంలో భారత్ పాకిస్తాన్ కు హెచ్చరిక జారీ చేసింది. అమెరికా దేశ మధ్యవర్తంగా శనివారం సాయంత్రం ఇరు దేశాల మధ్య ఏర్పడిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్తాన్ ఉల్లంఘనల పట్ల భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం…
India Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి చేసి ఏం అవుతుందిలే, భారత్ ఏం చేస్తుందిలే అనుకున్న పాకిస్తాన్ ఇప్పుడు, దాడి ఎందుకు చేశామా..? అని బాధపడటం తథ్యం. ఎందుకంటే, భారత్ వైమానిక దాడుల్లో భారీ ఎత్తున పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. భారత్ ఈ రేంజ్లో అటాక్ చేస్తుందని దాయాది ఊహించలేదు. ఉరి, పుల్వామా ఉగ్రదాడులు జరిగిన తర్వాత, భారత్ చేసినట్లు ఏదైనా చిన్న సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే చేస్తుందని అనుకుంది.