Kirana Hills: భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’లో ఇప్పుడు ఓ విషయం సంచలనంగా మారింది. పాకిస్తాన్‌లోని సర్గోదా సమీపంలో ఉన్న ‘‘కిరాణా కొండలు’’ సంచలనంగా మారాయి. సోమవారం త్రివిధ దళాల అధికారులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా కిరాణా కొండల ప్రస్తావన వచ్చింది. భారత్ పాక్ కిరాణా కొండలపై దాడి చేసిందా..? అని ప్రశ్నించిన నేపథ్యంలో, అసలేంటి ఈ కిరాణా కొండలు, అంత ప్రాముఖ్యత ఏంటనే అనుమానాలను రేకెత్తించింది.
Viral Video: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌ని చావు దెబ్బ తీసింది. ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ దాడి చేసిన తర్వాత, మన దేశ భూభాగాల్లోని పౌరులు, మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, విమానాలు, మిస్సైళ్లతో దాడులకు పాల్పడింది. అయితే, భారత గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థంగా వీటిని అడ్డుకున్నాయి.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌ని చావు దెబ్బ తీసింది భారత్. ఇటు ఉగ్రవాదుల స్థావరాలను నాశం చేస్తూనే, మరోవైపు పాక్ మిలిటరీకి గట్టి గుణపాఠం నేర్పింది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతను కూడా భారత్ బహిర్గతం చేసింది. ఇన్నాళ్లు తమ మిలిటరీ శక్తిని చూస్తూ గర్వపడిన పాకిస్తాన్‌కి భారత్ గర్వభంగం చేసింది. తమతో పెట్టుకుంటే పాకిస్తాన్ హర్ట్ ల్యాండ్‌లో కూడా దాడులు చేస్తామని నిరూపించింది.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత సత్తా ప్రపంచానికి తెలిసింది. భారత్ యాక్షన్‌లోకి దిగితే ఎలా ఉంటుందనే విషయం పాకిస్తాన్‌కి బాగా అర్థమైంది. ఇన్నాళ్లు తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని బెదిరిస్తూ వస్తున్న పాకిస్తాన్‌కి, అది పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులకు భారత్ ధీటైన సమాధానం ఇచ్చింది.
లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ.. ఓ క్రికెట్ స్టోరీ చెప్పుకొచ్చారు. మన ఎయిర్ ఫీల్డ్‌లను, లాజిస్టిక్స్‌ను టార్గెట్ చేయడం చాలా కఠినమైన అంశమని తెలిపారు. ఈ అంశాన్ని ఆయన వివరిస్తూ.. క్రికెట్ లో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. అయితే, ఈరోజు విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు.. అతను నా ఫెవరేట్ క్రికెటర్ అని పేర్కొన్నారు.
పాకిస్థాన్‌లోని కిరణా హిల్స్‌లో ఏముందో తమకు తెలియదని డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌పై ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. కిరణా హిల్స్ ఘటనపై మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.
Manoj Naravane: భారతదేశం, విజయవంతంగా పాకిస్తాన్‌పై దాడులు చేస్తున్న సమయంలో కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకుందని, మరికొన్ని రోజులు పాటు యుద్ధం చేసి పీఓకేని స్వాధీనం చేసుకుంటే బాగుండేదని దేశంలోని పలువురు అనుకుంటున్నారు. మరికొంత మంది బంగ్లాదేశ్ ఏర్పాటు చేసినట్లు బెలూచిస్తాన్‌ని కూడా ఏర్పాటు చేస్తే బాగుండేదని వాదిస్తున్నారు. కొందరు యుద్ధం ఆగిపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు.
India Pakistan Tension: ఆపరేషన్ సిందూర్ దాటికి పాకిస్తాన్ నిలవలేకపోయింది. ఇన్నాళ్లు మేము గొప్ప మిలిటరీ శక్తిగా భావిస్తూ వచ్చిన పాకిస్తాన్‌కి, భారత్ దాడులు దాని స్థాయి ఎంటో నిరూపించింది. పాకిస్తాన్ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలపై భారత్ దాడులు చేసింది. పాకిస్తాన్ లోని ఎయిర్‌బేస్‌లను భారత్ లక్ష్యంగా చేసుకుని భీకర దాడి చేసింది. అయితే, ఇప్పుడు ఓ సమాచారం పాకిస్తాన్లో వణుకు పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది.