ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి జాతినుద్దేశంచి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత సైన్యానికి, శాస్త్రవేత్తలకు మోడీ సెల్యూట్ చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో మన బలగాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయని కొనియాడారు. దేశ ప్రజలందరి తరపున సైన్యానికి అభినందనలు చెబుతున్నానన్నారు. ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు చెప్పారు. పహల్గామ్‌లో అత్యంత దారుణంగా కుటుంబ సభ్యుల ముందు భాగస్వాములను ఉగ్రవాదులు చంపేశారని.. ఇది వ్యక్తిగతంగా తనను ఎంతగానో బాధించిందని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: PM Modi LIVE: ఆపరేషన్ సిందూర్.. ప్రధాని మోడీ కీలక సందేశం లైవ్..
‘‘ఆపరేషన్ సిందూర్ న్యాయం కోసం చేసిన ఓ ప్రతిజ్ఞ. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. మన దాడితో పాకిస్థాన్ ఆత్మ రక్షణలో పడింది. ఒకే ఒక్కదాడితో పాకిస్థాన్ హడలెత్తిపోయింది. ఉగ్రవాదులను అంతమొందించాల్సిన పాకిస్థాన్ మనపై దాడి చేసింది. 100 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులను అంతమొందించాం. పాకిస్థాన్ మిస్సైల్ రాకుండా అడ్డుకున్నాం.’’ అని మోడీ తెలిపారు.ద
ఇది కూడా చదవండి: Trump: భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రెస్‌మీట్
‘‘మే 10న పాకిస్థాన్ డీజీఎంవోను సంప్రదించింది. అప్పటికే పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులను అంతమొందించాం. పాకిస్థాన్ చర్యలను బట్టే మన స్పందన ఉంటుంది. త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్‌తో ఒక కొత్త తరహా బుద్ధిని పాకిస్థాన్‌కు చూపించాం. అణు బెదిరింపులను ఏ మాత్రం సహించం.’’ అని మోడీ అన్నారు.