S-400: ‘‘ఆపరేషన్ సిందూర్’’ విజయం కావడంలో భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్లు, క్షిపణులను గాలిలోనే అడ్డుకుని, సత్తా చాటింది. దీంతో ఇప్పుడు ప్రపంచ దేశాల కన్ను ఎస్-400 సిస్టమ్‌పై పడింది. దీంతో రష్యా తయారు చేస్తున్న దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రపంచ దేశాలు ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ కొరకు రష్యాని సంప్రదిస్తున్నాయి. 600 కి.మీ నుంచి వచ్చే క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైల్స్, ఫైటర్ జెట్‌లను ట్రాక్ చేయడం, 400 కి.మీ వరకు టార్గెట్లను అడ్డగించడం దీని ప్రత్యేకత.
Read Also: PM Modi Speech: ప్రధాని మోడీ ‘‘ఆపరేషన్ సిందూర్’’ స్పీచ్‌పై ప్రపంచ మీడియా ఏం చెప్పిందంటే..
ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత్ మరిన్ని ఎస్-400 రక్షణ వ్యవస్థల కోసం రష్యాని సంప్రదించినట్లు తెలుస్తోంది. భారత్ తన వైమానిక రక్షణ సామర్థ్యాన్ని విస్తరించడానికి వీటిని కోరుతోంది. భారత్ 2018లో రష్యాతో ఐదు S-400 వైమానిక రక్షణ వ్యవస్థల కోసం USD 5.43 బిలియన్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు మరిన్ని ఎస్-400లు కావాలని భారత్ కోరుతున్నట్లు తెలుస్తోంది.