పాకిస్థాన్‌కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ సిందూర్‌తో నూర్ ఖాన్ వైమానిక స్థావరం పూర్తిగా దెబ్బతిందని.. విమానాశ్రయానికి సంబంధించిన రన్‌వే ధ్వంసమైందని గుర్తుచేశారు. లీజుకు తీసుకున్న చైనా విమానాలను రహీం యార్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ చేయగలరా? అంటూ ఒవైసీ ఎక్స్ ట్విట్టర్ వేదికగా పాకిస్థాన్‌ను ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: PM Modi: వాయుసేనను ఎందుకు కలవాల్సి వచ్చిందో వివరించిన మోడీ
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు.. 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. కుటుంబ సభ్యుల ముందే పురుషులను కాల్చి చంపేశారు. దీంతో భారత్ ప్రతీకారంతో రగిలిపోయింది. ఎలాగైనా పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది. దీంతో మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్‌పై భారత వాయుసేన మెరుపుదాడులు చేసింది. దీంతో రహీం యార్ ఖాన్ ఎయిర్‌బేస్ పూర్తిగా ధ్వంసం అయింది. అంతేకాకుండా వంద మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో దాయాది దేశం కాళ్ల బేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది.
ఇది కూడా చదవండి: S-400: మరిన్ని ఎస్-400 సిస్టమ్స్ కావాలి.. రష్యాని కోరిన భారత్.!
Will S Sharief & A Munir be able to land their Leased Chinese Aircraft at
Rahim Yar khan Airbase ?— Asaduddin Owaisi (@asadowaisi) May 13, 2025