పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకున్న చర్యల కారణంగా పాకిస్తాన్ భారీ నష్టాలను చవిచూసింది . ఆపరేషన్ సిందూర్‌లో, పాకిస్తాన్లో పెంచి పోషించిన అనేక మంది భయంకరమైన ఉగ్రవాదులను నాశనం చేశారు. ఆ తర్వాత పాక్ భారత్ పై దాడి చేసింది. భారత్ జరిపిన ప్రతీకార దాడుల్లో చాలా మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. పాకిస్తాన్ స్వయంగా దీనిని అంగీకరించింది. రెండు పొరుగు దేశాల మధ్య ఇటీవల ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారత సైన్యం జరిపిన దాడిలో…
‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో పాకిస్తాన్ దాడిలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఈరోజు ఉదయం బెంగళూరులోని నివాసం నుంచి బయలుదేరి.. మురళీ స్వగ్రామం కల్లితండాకు చేరుకొని వీరజవాన్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిని పరామర్శించారు. మురళీ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. వైసీపీ తరఫున రూ.25 లక్షలు సాయం అందిస్తామని మాజీ సీఎం చెప్పారు. Also Read: Liquor…
నిన్న ఆపరేషన్ సిందూర్ పై జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత, ప్రధాని మోడీ ఈరోజు తెల్లవారుజామున పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. ప్రధాని మోడీ ఈరోజు ఉదయం 7 గంటలకు ఢిల్లీలోని పాలం విమానాశ్రయం నుంచి బయలుదేరి పంజాబ్‌లోని జలంధర్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న వాయుసేన సిబ్బందితో ప్రధాని సమావేశం అయ్యారు. ప్రధాని మోదీ వైమానిక దళ సిబ్బందిని కలిసి వారి మనోధైర్యాన్ని పెంచడానికి కృషి చేశారు. పాకిస్తాన్‌కు ఇండియా ఎయిర్‌ఫోర్స్…
భారత్ పహల్గాం టెర్రర్ ఎటాక్ కు ప్రతీకారంగా పాక్ కు తగిన బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ను గడగడలాడించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ పై మరింత ఒత్తిడి తెచ్చేందుకు రెడీ అయ్యింది. ద్వైపాక్షిక ఒత్తిడి తెచ్చేందుకు నేడు పలు దేశాల సైనిక రాయబారులకు కేంద్రం ప్రత్యేక బ్రీఫింగ్ ఇవ్వనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు త్రివిధ దళాల డైరెక్టర్ జనరల్స్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్,…
Tiranga Yatra: భారత సైనిక దళాల ధైర్యసాహసాలను స్మరించుకుంటూ బీజేపీ పార్టీ మంగళవారం (మే 13) నుంచి దేశవ్యాప్తంగా ‘తిరంగా యాత్ర’ను ప్రారంభించనుంది. ఈ యాత్ర మే 13 నుంచి మే 23 వరకు 11 రోజుల పాటు కొనసాగనుంది. తాజాగా విజయవంతంగా ముగిసిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ఈ యాత్ర మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక నేడు సాయంత్రం 4 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. దేశభక్తి, ఐక్యత, సైనికుల సేవలకు గౌరవం తెలిపేలా…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు వెళ్లనున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి.. 11.30 గంటలకు కల్లితండాకు చేరుకుంటారు. ఉదయం 11.30 నుంచి 12.30 గంటల వరకు మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాలను పరామర్శిస్తారు. Also Read: Janasena: సైన్యానికి దైవ…
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత, భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ అనే పేరు ప్రజలకు బాగా నచ్చుతోంది. వారు తమ కూతుళ్లకు సింధూర్ అని పేరు పెడుతున్నారు. దేశ భక్తిని చాటుకుంటున్నారు తల్లిదండ్రులు. కుషినగర్ జిల్లాలో, మే 7 తర్వాత ఓ హాస్పిటల్ లో రెండు రోజుల్లో జన్మించిన 17 మంది బాలికలకు వారి తల్లిదండ్రులు సింధూర్ అని పేరు పెట్టారు. దేశంలోని త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్…
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గుణపాఠం నేర్పిన మన దేశ సైన్యంతో పాటు దేశ నాయకత్వానికి దైవ బలం, ఆశీస్సులు మెండుగా ఉండాలని షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో పూజలు చేయించాలని జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో పూజల కోసం జనసేన ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఇవాళ దేశ సైన్యం, దేశ నాయకత్వానికి దైవ బలం అండగా ఉండాలని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ…
PM Modi: ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. మహిళల సిందూరాన్ని దూరం చేస్తే ఏమవుతుందో అనే విషయాన్ని పాకిస్తాన్‌కి తెలియజేశామని, పహల్గామ్ దాడిని ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చారు.