ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, ఈ అంశంపై భారత్ వైఖరిని వివరించడానికి కీలకమైన విదేశీ దేశాలను సందర్శించడానికి భారత ప్రభుత్వం ఏడుగురు సభ్యుల అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ కూడా ఉన్నారు. తిరువనంతపురం నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన శశి థరూర్ ఈ అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇతర నామినేటెడ్ సభ్యులలో బిజెపి నాయకులు…
Celebi: ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో భారత్‌కి వ్యతిరేకంగా టర్కీ, పాకిస్తాన్‌కి సహకరించింది. టర్కీష్ డ్రోన్లను పాక్‌కి అందించింది. వీటిని దాయాది దేశం భారత్‌పైకి దాడిలో ఉపయోగించింది. ఇదే కాకుండా ఈ డ్రోన్లు ఆపరేట్ చేయడానికి ఇద్దరు టర్కీష్ వ్యక్తుల్ని కూడా పాకిస్తాన్ పంపించినట్లు వార్తలు వస్తున్నా్యి. అయితే, ఈ నిర్ణయంపై భారత్ టర్కీపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలోనే బాయ్‌కాట్ టర్కీ ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే టర్కీ నుంచి దిగుమతి అయ్యే ఆపిల్స్‌ని వ్యాపారులు బ్యాన్…
Traffic Restrictions: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన దాడి సక్సెస్ అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన తిరంగా యాత్ర రేపు హైదరాబాద్ లో జరగనుంది. హైదరాబాద్‌లో రేపు సాయంత్రం 5 గంటలకు ట్యాంక్‌బండ్ దగ్గర ఈ యాత్ర కొనసాగనుండటంతో.. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Indus Water Treaty: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ నిలిపేసింది. 26 మందిని బలి తీసుకున్న ఈ ఉగ్ర ఘటనకు పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాల్పడినట్లు తేలింది. పాకిస్తాన్ దేశంలో 80 శాతం మంది ప్రజలకు ఈ సింధు నది, దాని ఉపనదుల జలాలే జీవనాధారం. ప్రస్తుతం, ఈ ఒప్పందాన్ని నిలిపేయవద్దని పాకిస్తాన్ భారత్‌ని కోరుతోంది. ఇదిలా ఉంటే, భారత్ మాత్రం పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినంత కాలం ఈ…
Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ నాశనం చేసిన ఉగ్రవాద నెట్వర్క్ని పాకిస్తాన్ పునర్నిర్మంచడానికి ప్రయత్నిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక యోధుల తెగువను ఆయన ప్రశంసించారు. భుజ్ వైమానిక స్థావరంలో ఆయన మాట్లాడుతూ.. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాది అయిన జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కి పాకిస్తాన్ ప్రభుత్వం రూ. 14 కోట్లను ప్రటించిందని, పాకిస్తాన్‌కి రుణం ఇచ్చే అంశాన్ని ఐఎంఎఫ్ పునరాలోచించాలని…
Deputy CM: ఇటీవల మధ్యప్రదేశ్‌కి చెందిన బీజేపీ నేత విజయ్ షా కల్నల్ సోఫియా ఖురేషి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదంతాన్ని మరిచిపోకముందే, మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీస్ దేవ్డా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. సివిల్ డిఫెన్స్‌లో శిక్షణ కోసం వచ్చిన వాలంటీర్లను ఉద్దేశిస్తూ ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రజలతో పాటు సైన్యం దేశ ప్రధాని నరేంద్రమోడీ పాదాలకు నమస్కరించాలి అని అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన ప్రసంగంలో…
BrahMos: ఆపరేషన్ సిందూర్‌తో భారత్ పూర్తిగా పాకిస్తాన్‌పై ఆధిపత్యం చెలాయించిందని యూఎస్ యుద్ధరంగ నిపుణుడు కల్నల్(రిటైర్డ్) జాన్ స్పెన్సర్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. భారతదేశం దాడి ,రక్షణాత్మక ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని ఆయన అన్నారు. భారత్ పాకిస్తాన్‌లోని ఏ ప్రదేశాన్ని అయినా ఎప్పుడైనా, ఎక్కడైనా ఢీకొనగలమనే సందేశాన్ని ఇచ్చిందని చెప్పారు. పాకిస్తాన్ ఉపయోగించిన చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ భారతదేశ బ్రహ్మోస్ క్షిపణులను తట్టుకోలేదని ఆయన చెప్పారు.
ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో చూపించామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. గుజరాత్‌లోని భుజ్ ఎయిర్‌బేస్‌ను రాజ్‌నాథ్‌సింగ్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్రిక్తతలపై చర్చించాలని విపక్షాలు కోరాయి.
ఆపరేషన్ సిందూర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం రక్షణ వ్యవస్థపై పోకస్ పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో సైన్యానికి మరింత ప్రోత్సాహం అందించాలని కేంద్రం యోచిస్తోంది.