Beating Retreat: భారత్- పాకిస్తాన్ మధ్య గత 10 రోజుల నుంచి కాల్పుల విరమణ అమలులో ఉంది. 10 రోజుల విరామం తర్వాత మళ్లీ బోర్డర్ సెక్యూరిటీ దళాలు బీటింగ్ రీట్రీట్ సెర్మనీ నిర్వహించడానికి రెడీ అయింది. కాగా, పంజాబ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే, పూర్తి స్థాయిలో కాకుండా, స్వల్ప స్థాయిలో ఈ సెర్మనీ చేపట్టానున్నారు. పాకిస్తాన్‌తో ఉన్న సరిహద్దుల్లో వాఘా-అట్టారి, హుస్సేనివాలా, ఫజిల్కా దగ్గర బీటింగ్ రిట్రీట్ జరగనుంది.
Read Also: IPL 2025: తిక్కకుదిరింది.. గ్రౌండ్ లో గొడవ.. దిగ్వేష్ రాఠి-అభిషేక్ శర్మపై బీసీసీఐ చర్యలు
అయితే, బీటీంగ్ రిట్రీట్ సమయంలో పాకిస్తానీ వైపు ఉన్న బోర్డర్ గేట్లు తెరవబోమని భారత అధికారులు చెప్పారు. ఇక పాక్ సిబ్బందితో కరచాలనం చేయడం జరగదని తేల్చి చెప్పారు. కానీ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రేక్షకులకు అవకాశం కల్పించారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఈ ప్రోగ్రం జరగబోతుంది. అమృత్‌సర్‌కు సమీపంలో ఉన్న వాఘా-అట్టారితో పాటు ఫిరోజ్‌పుర్‌లోని హుస్సేనివాలా, ఫజిల్కాలోని సద్కి బోర్డర్ దగ్గర బీటింగ్ రిట్రీట్ ప్రోగ్రాం ఉంటుంది. సాయంత్రం 5.30 నిమిషాలకు భారీ సంఖ్యలో సద్కీ సరిహద్దుకు చేరుకోవాలని స్థానికులకు బోర్డర్ ఏరియా డెవలప్మెంట్ ఫ్రంట్ పిలుపునిచ్చింది.
Read Also: Pakistan PM: మారని పాక్ పీఎం.. భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..!
కాగా, వాఘా-అట్టారి సరిహద్దు వద్ద 1959 నుంచి బీటింగ్ రిట్రీట్‌ను కొనసాగిస్తున్నారు. ఆ సమయంలో రెండు దేశాల జాతీయ పతాకాలను అవనతనం చేయనున్నారు. సాధారణంగా బోర్డర్ వద్ద దివాళీ, ఈద్, గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ రోజుల్లో ఇరు దేశాలకు చెందిన సైనికులు స్వీట్లు పంచుకుంటారు. ఇక, అమృత్‌సర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో, లాహోర్‌కు 22 కిలోమీటర్ల దూరంలో వాఘా- అట్టారి బోర్డర్ ఉంది. ఇక్కడ బీటీంగ్ రీట్రీట్ కార్యక్రమం వీక్షించడానికి సుమారు 25 వేల మంది సామర్థ్యం కలిగిన గ్యాలరీ ఉంది.