పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డ హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు పేర్కొన్నారు. శనివారం ఆమెను అరెస్ట్ చేయగా.. న్యాయస్థానం ఆమెను ఐదు రోజులు కస్టడీకి ఇచ్చింది. దీంతో అధికారులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ విచారణంలో ఆమె కూల్‌గా ఉన్నట్లుగా నివేదికలు అందుతున్నాయి. ఇక ఆమెకు సంబంధించిన వీడియోలను పరిశీలించిన అధికారులు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్‌లో ఆమె చాలా ఫ్రీగా మసులుకుంది. అక్కడి మనుషులతో చాలా దగ్గర సంబంధాలు పెట్టుకుంది. వివిధ అధికారులను కూడా పరిచయం చేసుకుంది. ఇక న్యూఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయం అధికారి డానిష్‌తో ముఖంలో ముఖం పెట్టి మాట్లాడేంత చనువు కలిగి ఉంది. ఇద్దరూ నవ్వుతూ కనిపించిన వీడియోలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Jyoti Malhotra: భారత్‌పై ద్వేషం.. పాక్‌పై మమకారం.. జ్యోతి మల్హోత్రా అలా మారిపోవడానికి కారణమేంటి?
జ్యోత్యి మల్హాత్రా పాకిస్థాన్ గుప్పెట్లో ఒక పావుగా మారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆమెకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్‌లో 450 వీడియోలు ఉన్నాయి. వాటిని పరిశీలిస్తున్నారు. అలాగే ఆమె ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలు రాబడుతున్నారు. 2023, 2024, 2025లో ఇలా మూడు సార్లు ఆమె పాకిస్థాన్ సందర్శించింది. 2024లో నెల రోజులు పాకిస్థాన్‌లోనే ఉండిపోయింది. ఇక పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఇందులో పాకిస్థాన్ తప్పు ఏమీ లేదంటూ ఒక వీడియో పోస్టు చేసింది. పాకిస్థాన్‌ను సమర్థించి మాట్లాడింది. ఇక విచారణలో తన వాక్ స్వేచ్ఛను మాత్రమే వినియోగించుకున్నట్లు ఆమె చెప్పినట్లు నివేదిక తెలిపింది. విచారణలో ఆమె తీరును చూసి ఐబీ అధికారులే ఆశ్చర్యపోతున్నారు.
ఇది కూడా చదవండి: Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు బయటపెట్టిన తండ్రి..
ఇక ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సమయంలో పాకిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరిగిపినట్లు గుర్తించారు. డానిష్‌తో ఉన్న సంబంధాల నేపథ్యంలోనే ఆమె పాకిస్థాన్‌లో అన్ని ప్రదేశాలకు స్వేచ్ఛగా తిరిగినట్లుగా కనిపెట్టారు. విచారణలో కూడా ఆమె ఈ విషయాన్ని అంగీకరించినట్లు నివేదికలో పేర్కొన్నాయి. డానిష్ కారణంగా పాకిస్థాన్‌లో పలుచోట్ల జ్యోతికి వీఐపీ ట్రీట్‌మెంట్ జరిగినట్లుగా గుర్తించారు. అంతేకాకుండా పలుచోట్ల పోలీసులు కూడా భద్రత కల్పించారంటే ఆమె పాకిస్థాన్‌కు ఎంత దగ్గర అయిపోయిందో వేరే చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన ఇఫ్తార్ విందుకు పాక్ హైకమిషన్ జ్యోతికి ప్రత్యేక ఆహ్వానం పంపించారంటే ఆమె రేంజ్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఆమె లోపలికి వెళ్లగానే డానిష్ చాలా ప్రత్యేకంగా ఆహ్వానించాడు. అనంతరం ఇద్దరూ చాలా స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు. ఇక జ్యోతితో సంబంధాలు ఉన్నవారంతా పాక్ జాతీయులతో సంబంధాలు కొనసాగించినట్లు హిసార్ పోలీస్ సూపరింటెండెంట్ శశాంక్ కుమార్ సావన్ తెలిపారు. వీరందరికీ పాక్ అధికారులే స్పాన్సర్ చేసినట్లుగా కనిపెట్టారు.
పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది భర్తలను కోల్పోయి విధవరాళ్లుగా మారిపోతే జ్యోతి మల్హోత్రాలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదంటే.. ఆమె మనసు ఎంత కఠినంగా మారిపోయిందో చెప్పనక్కర్లేదు. పహల్గామ్ వీడియోలను జ్యోతిని పాకిస్థాన్ ఐఎస్ఐకి చేరవేసినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఆ దిశగానే దర్యాప్తు సాగుతోంది.