Indian Army Destroys Bomb: భారత్- పాకిస్తా్న్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో హైఅలర్ట్ ప్రకటించింది ఇండియన్ ఆర్మీ. దీంతో ప్రధాన మంత్రి నరేంద్ర భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఇందులో భాగంగానే, పాక్ ప్రయోగించిన ఓ లైవ్ షెల్ బయటపడింది. దీన్ని ఆర్మీ అధికారులు సమర్థవంతంగా ధ్వంసం చేసినట్లు ప్రకటించారు.
Read Also: Terrorist Attack : ఘోర కుట్ర వెలుగులోకి.. నాలుగు రాష్ట్రాల్ని వణికించేందుకు పేలుళ్ల ప్లాన్
అయితే, పహల్గామ్ ఉగ్రవా దాడికి ఆపరేషన్ సింధూర్‌తో భారత బలగాలు ధీటుగా సమాధానం చెప్పాయి. అది జీర్ణించుకోలేని పాకిస్తాన్.. జమ్మూ కాశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల ప్రజలపై దాడులకు దిగింది. ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీ వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక, కాల్పుల విరమణ నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలు క్రమంగా తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే పాక్ ప్రయోగించిన లైవ్ షెల్ ఒకటి పూంఛ్‌లో రోడ్డు పక్కన ఉండటాన్ని ఈరోజు (మంగళవారం) గ్రామస్తులు గుర్తించారు. ఆ విషయాన్ని భారత సైనిక అధికారులకు తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఆ లైవ్ షెల్ ను పేల్చేశాయి. పాక్ కవ్వింపు చర్యలకు పూంఛ్ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ సుమారు 25 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.