కన్నతల్లిని.. పుట్టిన గడ్డను మరిచిపోకూడదంటారు. ఇక దేశం పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలని పెద్దలు చెబుతుంటారు. భారతదేశం విషయానికొస్తే.. ఇక్కడున్న సంస్కృతి, సంప్రదాయాలు, వాతావరణం ఏ దేశంలో ఉండదు. ఇంతటి మంచి వాతావరణం భారతదేశం సొంతం. అలాంటి దేశం పట్ల ద్వేషం పెంచుకుంది ఓ భారతీయురాలు. సొంత దేశానికే వెన్నుపోటు పొడిచేందుకు కుయుక్తి పన్నింది. ఆమె ఎవరు? ఏంటో ఈపాటికే అర్థమై ఉంటుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రస్తుతం వార్తల్లో హాట్ టాఫిక్‌గా మారిన జ్యోతి మల్హోత్రా గురించి. అసలు ఆమె పాక్ ప్రేరేపిత మనిషిగా ఎలా మారిపోయింది. భారత్‌పై ఎందుకు ద్వేషం పెంచుకుంది. పాక్ నేతలతో అంతటి దగ్గర సంబంధాలు ఎలా పెంచుకోగలిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు బయటపెట్టిన తండ్రి..
జ్యోతి మల్హోత్రా హర్యానా వాసి. తండ్రి చాటు బిడ్డగా జీవితాన్ని సాగిస్తోంది. కోవిడ్-19 వరకు ఢిల్లీలో వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తుండేది. కరోనా తర్వాత ఉద్యోగాన్ని కోల్పోయింది. అనంతరం ట్రావెలర్ యూట్యూబర్‌గా అవతారం ఎత్తింది. భారత్‌లో వివిధ ప్రాంతాల్లోనే కాకుండా దాయాది దేశం పాకిస్థాన్‌తో పాటు అనేక దేశాలు చుట్టొచ్చేసింది.
ఇది కూడా చదవండి: India Pakistan Conflict: పాకిస్తాన్‌పై భారత్ దాడి చేస్తే.. దాక్కోవడానికి కలుగు వెతుక్కోవాలి!
సిక్కు మతానికి సంబంధించిన ఆమె.. పవిత్ర స్థలాలకు ఆధ్యాత్మిక ప్రయాణం అనే ముసుగులో ట్రావెల్ వ్లాగింగ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా తీర్థయాత్రలకు ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లే హర్‌కిరత్‌సింగ్ పరిచయం అయ్యాడు. ఇతడు పాకిస్థాన్ వెళ్లేందుకు సాయం చేశాడు. అయితే పాకిస్థాన్‌లో జరిగే సిక్కు మత పండుగ వైశాఖి ఉత్సవానికి వెళ్లేందుకు జ్యోతి మల్హోత్రాకు అనుమతి దొరకలేదు. ఆ సమయంలోనే ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో పని చేసే డానిష్‌కు జ్యోతి మల్హోత్రాను హర్‌కిరత్‌సింగ్ పరిచయం చేశాడు. అలా డానిష్‌తో జ్యోతి మల్హోత్రాకు దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి. అతడి పరిచయంతో మొదటిసారి 2023లో 324వ వైశాఖి పండుగ కోసం దాయాది దేశం పాకిస్థాన్‌లో అడుగుపెట్టింది. ఇక డానిష్‌తో జ్యోతికి మరింత దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో రెండోసారి 2024, ఏప్రిల్‌లో 325వ వైశాఖి ఉత్సవానికి జ్యోతి వెళ్లింది. అయితే ఈసారి ఒక నెలకు పైగా అక్కడే ఉండిపోయింది. ఏప్రిల్ 17 నుంచి మే 25 వరకు అక్కడే ఉండిపోయింది. ఆ సమయంలోనే పాక్‌లో ప్రముఖ వ్యక్తులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియంతో పాటు పలు కీలక వ్యక్తులతో రిలేషన్ పెంచుకున్నట్లు కథనాలు పేర్కొన్నాయి.
ఇక డానిష్‌తో జ్యోతి మల్హోత్రాకు చాలా క్లోజ్ సంబంధాలు ఏర్పడ్డాయి. అతడు ఆమెను మతపరంగా బాగా లోబర్చుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌పై ద్వేషం పెంచుకునేలా.. పాకిస్థాన్‌పై మమకారం పెంచేకునేలా ప్రేరేపించినట్లుగా సమాచారం. ఆమె నడిపిస్తున్న యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ జోలో దాదాపు 450 వీడియోలు ఉన్నాయి. అందులో ఎక్కువగా పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉన్న వీడియోలే ఉన్నాయి. ఇక దాయాది దేశాన్ని ఒక రేంజ్‌లో కీర్తించే విధంగా మారిపోయింది. పూర్తిగా ఆమె పాకిస్థాన్ ప్రేమికురాలిగా మారిపోయింది. ఎంతగా అంటే ఇటీవల పహల్గామ్ ఉగ్ర దాడి జరిగి 26 మంది చనిపోయారు. కొత్తగా పెళ్లైన మహిళలతో పాటు అనేక మంది మహిళలు విధవరాళ్లు అయ్యారు. దేశమంతా దు:ఖంలో ఉంది.
పహల్గామ్ ఉగ్ర ఘటన తర్వాత భారత్.. పాకిస్థాన్ పట్ల కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను ఆమె తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. భారత్‌కు వ్యతిరేకంగా.. పాక్‌కు అనుకూలమైన వ్యాఖ్యలు చేస్తూ కీలక పోస్టులు పెట్టింది. అంతగా ఆమె పాక్‌కు ముగ్ధురాలు అయిపోయింది. ఇంకొక విషయమేంటంటే ప్రస్తుతం విచారణలో ఉన్న ఆమెలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించకపోవడం విశేషం. ఇక పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన సమయంలో డానిష్‌తో ఎన్‌క్రిప్టెడ్ సంబంధాలు నెరిపింది. అతడితో రహస్య సంభాషణ సాగించినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించారు.
ఇక ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడికి ముందు మార్చిలో జ్యోతి పాకిస్థాన్ వెళ్లినట్లుగా అధికారులు కనిపెట్టారు. అంతకముందు ఆమె కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు పహల్గామ్ ప్రదేశాలను చిత్రీకరించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను పాక్ అధికారులకు చేరవేసినట్లుగా అధికారులు గుర్తించారు. డానిష్‌కు.. పాకిస్థాన్ ఐఎస్ఐతో మంచి సంబంధాలు ఉన్నాయి. జ్యోతి సాయంతో భారత రక్షణ విషయాలను ఐఎస్ఐకు చేరవేసినట్లు సమాచారం. ఎప్పుడైతే జ్యోతి-డానిష్ సంబంధాలు బయటపడ్డాయో మే 13న డానిష్‌ను భారత్ నుంచి బహిష్కరించారు.
ఇక పాకిస్థాన్‌తో జ్యోతికి బాగా దగ్గర సంబంధాలు ఏర్పడిన తర్వాత ఆమె చైనా, నేపాల్, బంగ్లాదేశ్, యూఏఈ, థాయిలాండ్, ఇండోనేషియా, భూటాన్ వంటి అనేక దేశాలను ఆమె సందర్శించినట్లుగా ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో పేర్కొంది. 2024 నవంబర్‌లో కాశ్మీర్ పర్యటన.. 2025 మార్చిలో పాకిస్థాన్‌లో జ్యోతి పర్యటించడం. ఈ రెండు పరిణామాల తర్వాతనే పహల్గామ్ ఉగ్ర దాడి జరినట్లుగా ఐబీ భావిస్తోంది. ప్రస్తుతం జ్యోతికి సంబంధించిన డిజిటల్ పరికరాలన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌క్రిప్టెడ్ చాట్‌లు, పాకిస్థాన్‌కు అనుకూలమైన కంటెంట్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా ఐబీ దర్యాప్తు చేస్తోంది. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.