India’s Diplomatic Wins: ఖతార్ దేశం గూఢచర్యం ఆరోపణలతో 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు ఉరిశిక్ష విధించింది. అయితే, అనూహ్యంగా భారత ఒత్తిడి మేరకు వీరందరిని ఖతార్ ప్రభుత్వం విడిచిపెట్టింది. ప్రస్తుతం వీరంతా భారత్ చేరుకున్నారు. ఇదే కాకుండా ప్రధాని మోడీ హయాంలో పలు కీలకమై దౌత్యవిజయాలు లభించాయి. 1) నేవీ అధికారుల విడుదల: ఇజ్రాయిల్ తరుపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో భారత్‌కి చెందిన 8 మంది మాజీ నేవీ అధికారులను ఖతార్ ప్రభుత్వం…
Central Government File Affidavit on Ukraine Returnee Medical Students: ఉక్రెయిన్ విద్యార్థులకు నిరాశే ఎదురైంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ దేశాన్ని వదిలిపెట్టి ఇండియాకు చేరుకున్న విద్యార్థుల కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులు ఇండియాలోని వైద్య కళాశాల్లో అడ్మిషన్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందడం చట్టపరంగా…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్ అధ్యక్షుడు చేతులెత్తేసి.. తాను నాటోలో చేరబోను.. యుద్ధం ఆపండి.. అంటూ విజ్ఞప్తి చేసినా.. ఇంకా.. రష్యా మాత్రం యుద్ధం ఆపలేదు.. మరోవైపు.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విద్యార్థుల తరలింపు కోసం చేపట్టిన ఆపరేషన్ గంగలో భాగంగా రేపు ఇండియాకు చివరి విమానాలు రాబోతున్నాయి.. సుమీలో చిక్కుకున్న భారతీయులను తరలింపు ప్రక్రియ పూర్తి చేశారు.. సుమీ నుంచి…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వివిధ దేశాల విద్యార్ధులు, పౌరులు నానా యాతన అనుభవిస్తున్నారు. ఆపరేషన్ గంగా కార్యక్రమం ద్వారా యుద్ధ ప్రాతిపదికన వేలాదిమందిని భారత్ స్వదేశాలకు తరలించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారిని స్వస్థలాలకు పంపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ లోని సుమీ లో చిక్కుకుపోయున భారతీయ విద్యార్థుల తరలింపు సాధ్యంకాలేదని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి చెప్పింది భారత్. ఇప్పటికి 20 వేల మంది భారతీయులను, భారత్ ను కోరిన ఇతర దేశస్థులను కూడా తరలించామని యు.ఎన్…
ఆపరేషన్ గంగ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వరకు 73 విమానాల్లో 15,206 మందిని భారత్ తీసుకొచ్చినట్టు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. అలాగే 10 ఎయిర్‌ఫోర్స్ విమానాల్లో 2056 మందిని తరలించినట్టు తెలిపింది. సోమవారం 7 విమానాల్లో 1314 మంది భారత్ వచ్చినట్టు వివరించింది. మొత్తంగా ఫిబ్రవరి 22న ఆపరేషన్ గంగ మొదలైనప్పట్నుంచి ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి 17,400 మందికి పైగా భారతీయులను సొంత దేశానికి తరలించామని వివరించింది. మంగళవారం మరో 2 విమానాలు భారత్…
ఉక్రెయిన్ -రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ వేలాదిమంది భారతీయులు చిక్కుకుని పోయారు. ఆపరేషన్ గంగ ద్వారా కేంద్ర విదేశాంగ శాఖ యుద్ధ ప్రాతిపదికన విద్యార్ధుల్ని తరలిస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విద్యార్ధుల తరలింపుపై కీలక ప్రకటన చేశారు. రొమేనియా నుంచి 31 విమానాల్లో 6680 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తరలించామన్నారు. పోలెండ్ నుంచి 13 విమానాల్లో 2822 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తరలించారు. హంగేరి నుంచి 26 విమానాల్లో…
ఉక్రెయిన్ లో భారత విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న అంశంపై వివరణ ఇచ్చింది కేంద్ర విదేశాంగ శాఖ. విద్యార్థులు బందీలుగా ఉండటంపై మాకు ఎలాంటి నివేదికలు అందలేదు. ఉక్రెయిన్‌లోని ఇండియా ఎంబసీ భారతీయ పౌరులతో నిరంతరం టచ్‌లో ఉంది. ఉక్రేనియన్ అధికారుల సహకారంతో చాలా మంది విద్యార్థులు నిన్న ఖార్కివ్ నుండి బయలుదేరారు. భారత పౌరుల తరలింపునకు ఉక్రేనియన్ అధికారులు అందించిన సహాయాన్ని అభినందిస్తున్నాం. భారతీయుల తరలింపులో సహకారం అందిస్తున్న ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు ధన్యవాదాలు తెలిపింది విదేశాంగ…
ఉక్రెయిన్ పొరుగు దేశాలకు చేరుకున్న భారతీయ విద్యార్థులు, పౌరులను స్వదేశానికి వేగంగా తరలించేందుకు ముమ్మర సన్నాహాలు చేసింది భారత ప్రభుత్వం. ఆపరేషన్ గంగాలో భాగంగా ప్రత్యేక విమానాలు నడుపుతోంది. వచ్చే మూడు రోజులలో మొత్తం 26 విమానాలను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల లక్షలాదిమంది నిరాశ్రయులవుతున్నారు. వేలాదిమంది మరణిస్తున్నారు. వేలాదిమంది భారతీయ విద్యార్ధులు రష్యా సరిహద్దుల్లో చిక్కుకుని పోయారు. తూర్పు ఉక్రేయిన్ లోని “సుమీ” పట్టణంలో చిక్కుకుపోయారు 500 మంది భారతీయ విద్యార్థులు. రష్యా సరిహద్దులకు కేవలం రెండు గంటల్లో చేరుకునే దూరంలో ఉంది సుమీ పట్టణం. వెనువెంటనే తమను రష్యా గుండా స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు విద్యార్థులు. ఉక్రెయిన్ పశ్చిమ వైపునకు వెళ్లడానికి 20 గంటల ప్రయాణం చేయాల్సి ఉంది. ప్రస్తుత…
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే ఆపరేషన్ గంగ పేరుతో భారత పౌరులను స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు సాగుతుండగా.. మరిన్ని ప్రయత్నాలు మొదలుపెట్టారు.. భారత వైమానిక దళాన్ని తరలింపు ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను మరింత వేగంగా తీసుకు వచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.. భారత వైమానిక దళానికి చెందిన C-17 విమానం ద్వారా భారతీయులను తీసుకొచ్చేందుకు ఆలోచన…