ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్ అధ్యక్షుడు చేతులెత్తేసి.. తాను నాటోలో చేరబోను.. యుద్ధం ఆపండి.. అంటూ విజ్ఞప్తి చేసినా.. ఇంకా.. రష్యా మాత్రం యుద్ధం ఆపలేదు.. మరోవైపు.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విద్యార్థుల తరలింపు కోసం చేపట్టిన ఆపరేషన్ గంగలో భాగంగా రేపు ఇండియాకు చివరి విమానాలు రాబోతున్నాయి.. సుమీలో చిక్కుకున్న భారతీయులను తరలింపు ప్రక్రియ పూర్తి చేశారు.. సుమీ నుంచి 694 మందిని ఇప్పటికే పోలాండ్ కు తరలించారు.. ల్వీవ్ రైల్వే స్టేషన్ వద్ద భారత రాయబారి వీరికి వీడ్కోలు పలికారు. విద్యార్థులంతా రేపు భారత్‌కు బయల్దేరే అవకాశం ఉందని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. రేపు పోలాండ్ నుండి భారత్‌కు రానుంది అని చెబుతున్నారు..
Read Also: KRMB: రేపు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక భేటీ
మరోవైపు, రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న శాంతి చర్చలు ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. చర్చల్లో కాస్త పురోగతి లభించిందని రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తాము ప్రయత్నించడం లేదని స్పష్టం చేసింది రష్యా.. ఇక, రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇతర దేశాల నుంచి వస్తున్న వ్యతిరేకతలు, ఆంక్షలను లెక్క చేయకుండా ముందుకు వెళ్తోంది రష్యా. మరోవైపు రష్యాలో విదేశీ కరెన్సీ విత్‌డ్రాపై ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ తాత్కాలిక పరిమితులు విధించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఆ ఆంక్షలు ఉంటాయని వెల్లడించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రకటన నేపథ్యంలో.. రష్యా ముందుకు వచ్చి యుద్ధం ఆపేస్తుందా? లేదా? అనేది వేచిచూడాల్సిన అంశం. ఇక, ఆపరేషన్ గంగాతో ఇప్పటి వరకు 18 వేల మందికి పైగా భారతీయులను స్వదేశానికి చేర్చింది భారత ప్రభుత్వం.