ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో విదేశీయులు ముఖ్యంగా అక్కడ విద్యాభ్యాసం కోసం వెళ్ళిన భారతీయులు నానా అవస్థలు పడుతున్నారు. తెలుగు విద్యార్ధులు నానా కష్టాలు పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. కరీంనగర్ జిల్లా రామచంద్రాపురం ప్రాంతానికి చెందిన యువతి కడారి సుమాంజలి ఉక్రెయిన్ లో ఇక్కట్లు పడుతోంది. ఆమె అవస్థలు అన్నీ ఇన్నీకావు. 4 రోజుల నుంచి ఆహారం కూడా లేదని ఆమె ఆవేదన చెందుతోంది. కూతురి కష్టాలు చూసిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఎంబసీ అధికారులు…
ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఓవైపు చర్చలు.. మరో వైపు యుద్ధం ఇలా.. రెండూ సాగుతున్నాయి.. మరోవైపు ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం.. ఉక్రెయిన్‌లో ఇంకా 15 వేల మంది భారతీయులు చిక్కుకున్నారు.. వారంతా ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు తరలివస్తున్నారు.. దాడులు జరుగుతుండడంతో భయపడిపోతున్నారు.. పోలండ్‌లో భారతీయులపై అక్కడి స్థానిక పోలీసులు దాడులు చేశారు.. దీంతో ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు మంత్రులను పంపాలని భావిస్తోంది కేంద్రం. ఉక్రెయిన్ సంక్షోభంపై…
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వివిధ దేశాల విద్యార్థులు, ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది.. ఇక, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ వేగం పుంజుకుంది.. ఆపరేషన్ గంగ పేరుతో చేపట్టిన ఈ తరలింపు ప్రక్రియలో భాగంగా ఇప్పటికే నాలుగు విమానాలు స్వదేశానికి రాగా.. తాజాగా ఐదో విమానం ఢిల్లీకి చేరింది.. ఈ విమానంలో 249 మంది విద్యార్థులు, భారతీయులతో కూడిన ఎయిర్ ఇండియా విమానం రొమేనియాలోని బుకారెస్ట్…