ఉక్రెయిన్ -రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ వేలాదిమంది భారతీయులు చిక్కుకుని పోయారు. ఆపరేషన్ గంగ ద్వారా కేంద్ర విదేశాంగ శాఖ యుద్ధ ప్రాతిపదికన విద్యార్ధుల్ని తరలిస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విద్యార్ధుల తరలింపుపై కీలక ప్రకటన చేశారు. రొమేనియా నుంచి 31 విమానాల్లో 6680 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తరలించామన్నారు.
పోలెండ్ నుంచి 13 విమానాల్లో 2822 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తరలించారు. హంగేరి నుంచి 26 విమానాల్లో 5300 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తరలించామని జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. స్లోవేకియా నుంచి ఆరు విమానాల్లో 1118 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తరలించినట్టు మంత్రి వెల్లడించారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో చిక్కుకుపోయున ఏపీ విద్యార్థులను సొంత దేశానికి, ఏపీకి తరలించే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి రవి రెడ్డి. ఇప్పటివరకు 76 విమానాల్లో 15,920 మంది భారతీయ విద్యార్థులను విజయవంతంగా స్వదేశానికి తీసుకొచ్చామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా వివరించారు. ఈమేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ట్వీట్ చేశారు.
Update on #OperationGanga in Romania & Moldova:
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) March 5, 2022
– Evacuated 6222 Indians in the last 7 days
– Got a new airport to operate flights in Suceava (50 km from border) instead of transporting students to Bucharest (500 km from border)
– 1050 students to be sent home in the next 2 days