India’s Diplomatic Wins: ఖతార్ దేశం గూఢచర్యం ఆరోపణలతో 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు ఉరిశిక్ష విధించింది. అయితే, అనూహ్యంగా భారత ఒత్తిడి మేరకు వీరందరిని ఖతార్ ప్రభుత్వం విడిచిపెట్టింది. ప్రస్తుతం వీరంతా భారత్ చేరుకున్నారు. ఇదే కాకుండా ప్రధాని మోడీ హయాంలో పలు కీలకమై దౌత్యవిజయాలు లభించాయి.
1) నేవీ అధికారుల విడుదల:
ఇజ్రాయిల్ తరుపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో భారత్‌కి చెందిన 8 మంది మాజీ నేవీ అధికారులను ఖతార్ ప్రభుత్వం దోషులుగా చిత్రీకరించింది. వీరికి ఉరిశిక్ష విధించింది. అయితే, దీనిపై భారత్, ఖతార్ మధ్య పలు మార్లు చర్చలు జరిగాయి. దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన COP28 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఖతార్‌కు అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీనితో భేటీ అయ్యారు. ఇది జరిగిన కొన్ని వారాల తర్వాత డిసెంబర్ నెలలో ఉరిశిక్షను నిలిపేసి, వారందరిని ప్రస్తుతం విడుదల చేశారు.
2) G-20 సమావేశం:
గతేడాది సెప్టెంబర్ నెలలో భారత అధ్యక్షతన జీ-20 సమ్మిట్ జరిగింది. ఈ సమావేశంలో వెస్ట్రన్ దేశాలు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఏకాకి చేయాలని భావించినప్పటికీ.. భారత్ తన దౌత్యనీతిలో ఏకాభిప్రాయ ప్రకటనను ఆమోదించేలా చేసింది.
3) రష్యా నుంచి చమురు కొనుగోలు:
2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. ఆ తర్వాత వెస్ట్రన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అయితే, భారత్ మాత్రం రష్యా నుంచి చమురును డిస్కౌంట్‌లో అత్యధికంగా కొనుగోలు చేసింది. వెస్ట్రన్ దేశాల నుంచి భారత్‌పై ఒత్తిడి ఎదురైనప్పటికీ.. చమురు కొనుగోలు, రష్యాతో స్నేహం విషయంలో వెనక్కి తగ్గలేదు.
4) ఆపరేషన్ గంగా:
ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు భారత్ ‘ఆపరేషన్ గంగా’ని ప్రారంభించింది. రొమేనియా, పోలాండ్ దేశాల సహాయంతో వీరందరిన్ని వెనక్కి రప్పించింది.
5) ఆపరేషన్ ‘సముద్రసేతు’:
కరోనా వైరస్ ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో భారత పౌరులను విదేవాల నుంచి రక్షించేందుకు ఇండియన్ నేవీ ఆపరేషణ్ ‘సముద్ర సేతు’ని ప్రారంభించింది.
6) ఆపరేషన్ సంజీవిని:
ఏప్రిల్ 2020లో కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ సరిహద్దులు మూసేసిన సమయంలో, మాల్దీవుల వైద్య అవసరాలను తీర్చడానికి ఆపరేషన్ సంజీవిని ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కింద, ప్రత్యేక భారత వైమానిక దళం (IAF) విమానం భారతదేశం నుండి 6.2 టన్నుల అవసరమైన వైద్య సామాగ్రిని మాల్దీవులకు తరలించింది.
7) వ్యాక్సిన్ దౌత్యం:
ప్రపంచం మహమ్మారితో పోరాడుతున్నప్పుడు భారతదేశం అనేక దేశాలకు ఉచితంతగా కోవిడ్ వ్యాక్సిన్ అందించింది.
8) ఆపరేషన్ అజయ్:
ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్ నుంచి భారత ప్రజల్ని తీసుకువచ్చేందుకు ‘ఆపరేషన్ అజయ్’ చేపట్టింది.
9) అభినందన్ స్వదేశానికి:
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ని పాకిస్తాన్ తన చెర నుంచి ఇండియాకు అప్పగించింది. పుల్వామా దాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఆ తర్వాత భారత్ పైకి పాకిస్తాన్ తన ఎఫ్-16తో దాడులు చేసేందుకు వచ్చిన క్రమంలో అభినందన్ తన మిగ్-21 బైసన్ విమానంతో పాక్ విమానాలను వెంబడించారు. ఈ క్రమంలో ఒక ఎఫ్-16ని కూల్చిన తర్వాత అభినందన్ విమానం పీఓకేలో కూలిపోయి, పాక్ ఆర్మీకి చిక్కాడు. ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిడితో అభినందన్‌ని పాక్, ఇండియాకు అప్పగించింది.
10) ఆపరేషన్ వందేభారత్:
కోవిడ్ సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ‘‘ఆపరేషన్ వందేభారత్’’ని చేపట్టింది.