Central Government File Affidavit on Ukraine Returnee Medical Students: ఉక్రెయిన్ విద్యార్థులకు నిరాశే ఎదురైంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ దేశాన్ని వదిలిపెట్టి ఇండియాకు చేరుకున్న విద్యార్థుల కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులు ఇండియాలోని వైద్య కళాశాల్లో అడ్మిషన్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందడం చట్టపరంగా సాధ్యం కాదని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.
Read Also: Adivi Sesh: ‘హిట్ 2’ థియేటర్లను హిట్ చేసేది ఎప్పుడంటే..?
నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతోనే విద్యార్థులు ఉక్రెయిన్ లో మెడిసిన్ చదివేందుకు వెళ్లారని కేంద్రం వెల్లడించింది. దీంతో వీరికి ఇక్కడ ప్రవేశాలు చట్టబద్ధం కావని తేల్చి చెప్పింది కేంద్రం. అయితే ఉక్రెయిన్ కళాశాల అనుమతితో ఇతర దేశాల్లో డిగ్రీని పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తామని అఫిడవిట్ లో పేర్కొంది. ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చే విద్యార్థులకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం, దేశంలోని అపెక్స్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ బాడీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎంసి)తో సంప్రదించి తగిన చర్యలు చేపట్టినట్లు కోర్టుకు తెలిపింది కేంద్రం. స్వదేశానికి తిరిగి వచ్చిన విద్యార్థులను దేశంలోని మెడికల్ కాలేజీలకు బదిలీ చేయడంతోపాటు… ఈ విషయంలో చేసే సడలింపులు అన్నీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం, నేషనల్ మెడికల్ కమిషన్ చట్టాలకు అనుగుణంగానే జరుగుతాయని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. రేపు ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
ఫిబ్రవరి నుంచి రష్యా, ఉక్రెయిన్ పై దాడి చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ కొనసాగుతూనే ఉంది. అయితే ఆ సమయంలో ఉక్రెయిన్ దేశంలోని పలు నగరాల్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులును ‘ ఆపరేషన్ గంగా’ చేపట్టి ఇండియాకు తీసుకువచ్చారు. రోమేనియా, పోలాండ్, మల్దోవా, హంగేరీ, స్లోవాకియా దేశాల మీదుగా 18 వేల ఇండియన్ స్టూడెంట్స్ ను విజయవంతంగా ఇండియాకు చేర్చారు.