రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వివిధ దేశాల విద్యార్ధులు, పౌరులు నానా యాతన అనుభవిస్తున్నారు. ఆపరేషన్ గంగా కార్యక్రమం ద్వారా యుద్ధ ప్రాతిపదికన వేలాదిమందిని భారత్ స్వదేశాలకు తరలించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారిని స్వస్థలాలకు పంపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ లోని సుమీ లో చిక్కుకుపోయున భారతీయ విద్యార్థుల తరలింపు సాధ్యంకాలేదని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి చెప్పింది భారత్.
ఇప్పటికి 20 వేల మంది భారతీయులను, భారత్ ను కోరిన ఇతర దేశస్థులను కూడా తరలించామని యు.ఎన్ కు తెలిపింది భారత్. పలుమార్లు ఉక్రేయిన్, రష్యా లకు విజ్ఞప్తి చేసినా, సుమీలో ఉన్న భారతీయ విద్యార్దుల తరలింపుకు సురక్షిత మార్గాలను ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదంది భారత్. చిక్కుకుపోయున వారిని తరలించేందుకు 80 కి పైగా విమానాలు నిరంతరం తిరుగుతూనే ఉన్నాయని వివరించింది ఇండియా. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి తరలింపు కార్యక్రమాన్ని ఇంకా చేపట్టేందుకు సిధ్ధంగా ఉన్నామని ఐక్యరాజ్యసమితికి వెల్లడించింది ఇండియా. ఇదిలా వుంటే.. సోమవారం సాయంత్రం ఢిల్లీ కి చేరుకున్నారు మరో 9 మంది తెలంగాణ విద్యార్ధులు. ఇప్పటివరకు స్వదేశానికి చేరుకున్న మొత్తం తెలంగాణ విద్యార్ధులు 634 మంది అని అధికారులు తెలిపారు.