బెజవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య మరోసారి రాజుకున్న వివాదం పొలిటికల్ ప్రకంపనలు రేపుతోంది? రెండు సార్లు ఎంపీగా గెలిచిన అన్న నానిని గత ఎన్నికల్లో మొదటి ప్రయత్నంలోనే ఓడించి రికార్డు మెజార్టీతో పాగా వేశారు తమ్ముడు కేశినేని చిన్ని. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఈ అన్నదమ్ముల మధ్య వివాదం 2024 ఎన్నికలకు ముందు బయట పడింది. నాని ఎంపీగా ఉన్నప్పుడే... టీడీపీలో యాక్టివ్ అయిపోయి ఆయనకు పక్కలో బల్లెంగా మారారట చిన్ని. చివరికి…
అది ఆంధ్రప్రదేశ్ అయినా.... ఉత్తరప్రదేశ్ అయినా... బీజేపీకి ఉన్న ముద్ర మాత్రం అగ్రవర్ణాల పార్టీ అని. అందులోనూ భేషజాలు లేకుండా చెప్పుకోవాలంటే... బ్రాహ్మణుల పార్టీ, ఉత్తరాది పార్టీ అని కూడా అంటారు. ఇప్పుడు ఏపీ బీజేపీ ఈ ముద్రనే చెరిపేసుకునే దిశగా అడుగులేస్తోందట. అగ్రవర్ణ ముద్రను పోగొట్టి... బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్య పార్టీగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
డొక్కా మాణిక్య వరప్రసాద్.... ఏపీ పాలిటిక్స్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 2004లో గుంటూరు జిల్లా తాడికొండనుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారాయన. 2009లో కూడా రెండోసారి అదే నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు మాజీమంత్రి. ఇంకా చెప్పాలంటే... ఆ తర్వాత ఆయన రాజకీయ జీవితం తీవ్ర ఒడిదుడుకుల్లో పడింది. అందు కారణం అంతా స్వయంకృతమేనంటారు పొలిటికల్ పండిట్స్. నిలకడలేని నిర్ణయాలతో తన రాజకీయ…
నడిగడ్డ ప్రాంతంగా చెప్పుకునే గద్వాల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటుంది. 2014 ఎన్నికల వరకు కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించి అసెంబ్లీకి పంపిన ఇక్కడి ఓటర్లు.. 2018, 2023 ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్కు బాసటగా నిలిచారు. మారిన రాజకీయ పరిణామాలతో గద్వాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి... మంత్రి జూపల్లి ప్రోద్బలంతో కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు.
తెలంగాణ బీజేపీ అనుకున్నది సాధించగలిగిందా? ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌లో వేరే పార్టీ సభ్యుల ఓట్లు కమలానికి పడ్డాయా? ఉన్నబలంకంటే ఒక్కటి రెండు ఓట్లు ఎక్కువ సాధించినా సక్సెస్ అయినట్టేననన్న కాషాయ దళం ఆశలు నెరవేరే అవకాశ ఉందా? ఈ విషయమై ఎలాంటి చర్చ జరుగుతోంది పార్టీలో? హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ముగిసింది. శుక్రవారంనాడు ఫలితం వస్తుంది. ఈ క్రమంలో బీజేపీ ఆడిన మైండ్ గేమ్ ఎంతవరకు వర్కౌట్ అయింది? ఆ పార్టీ అనుకున్నది…
అధికారం కోల్పోయాక అక్కడ గులాబీ దళంలో వర్గ పోరుకు బీజం పడిందట. పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం ఆకర్ష మంత్రం జపిస్తుండటం కేడర్‌ను ఇరకాటంలో పెడుతోందట. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టే టార్గెట్‌గా పావులు కదుపుతున్న ఆ ఇద్దరు నాయకులు ఎవరు? ఏ నియోజకవర్గ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే స్కెచ్లేస్తున్నారు? ఉమ్మడి పాలమూరు జిల్లా షాద్‌నగర్ గులాబీ నేతల తీరుపై ఇప్పుడు పార్టీలో హాట్ హాట్ చర్చ జరుగుతోందట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా, ఎలా ఉన్నా…
అక్కడ టీడీపీ శాసనసభ్యులకు అసలు మేం ఎమ్మెల్యేలమో కాదోనన్న అనుమానం వస్తోందా? పార్టీ అధికారంలో ఉందన్న ఆనందం కూడా వాళ్ళలో లేకుండా పోయిందా? ఇదెక్కడి ఖర్మరా… బాబూ.. అంటూ తలలు కొట్టుకుంటున్నారా? పార్టీ పవర్లోకి వచ్చినప్పటి నుంచి మా బతుకులు ఇలాగే ఏడిశాయని ఫ్రస్ట్రేట్ అవుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? వాళ్ళకొచ్చిన కష్టం ఏంటి? ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారి కూటమి పవర్లోకి వచ్చాక అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఫీలయ్యారట ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నాయకులు. ఏం……
మరిదిని అరెస్ట్ చేసి వదినమ్మని వదిలేశారా? లేక ఆయన ఇచ్చే సమాచారంతో నట్లు గట్టిగా బిగించాలన్న ప్లాన్ ఉందా? మాజీ మంత్రి విడదల రజనీ కేసులో ఏం జరుగుతోంది? కేసులో ఏ1గా ఉన్న రజనీ బయట తిరుగుతున్నా, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా… ఆమె జోలికి వెళ్ళకుండా ఏ3 అయిన ఆమె మరిదిని వెదికి మరీ ఎందుకు పట్టుకున్నారు? ఏ3 ఇచ్చే సమాచారంతో ఏ1ని గట్టిగా ఫిక్స్ చేయాలనుకుంటున్నారా? ఆ విషయంలో అసలేం జరుగుతోంది? ఏపీ మాజీ మంత్రి…
ఊరించి…ఊరించి ఉసూరుమనిపించారా ..? అదిగో..ఇదిగో అంటూ చెప్పి ఆగమాగం చేసేశారా? జరగాల్సిన చర్చలు, రచ్చలన్నీ జరిగిపోయాక ఇప్పుడు తూచ్ అంటున్నారా? తెలంగాణ కేబినెట్ విస్తరణ కథ కంచికేనా? ఇక ఇప్పట్లో ఆ ఊసే ఉండబోదా? ఆ విషయంలో అసలేం జరిగింది? కేబినెట్ విస్తరణ ఉన్నట్టా..? లేనట్టా..? అదిగో…ఇదిగో అంటూ చేసిన చర్చలన్నీ ఉత్తుత్తివేవా? ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్వర్గాలకు వస్తున్న కొత్త ప్రశ్నలివి. వీటికి సమాధానాల కోసం పార్టీలో ఏ నాయకుడిని అడిగినా… ఏమో.. ఎవరికి తెలుసు అన్నదే…
మహానాడు విషయం ఆ టీడీపీ నేతలకు పట్టడం లేదా? స్వయంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు కూడా వాళ్ళని కదిలించలేకపోతున్నాయా? కడప టీడీపీ నేతలు ఎందుకు అంత తోలు మందంగా ఉన్నారు? ఇంతవరకు కనీసం స్థలాన్ని ఎంపిక చేయకపోవడం వెనక కారణాలేంటి? కడప టీడీపీ లీడర్స్ మనసులో అసలేముంది? తెలుగుదేశం పార్టీ స్థాపించాక మొట్టమొదటిసారి… ఊహించని రీతిలో గత ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది టీడీపీ. ఆ ఊపులోనే… ఈసారి మహానాడును కూడా అదే స్థాయిలో…