కాంగ్రెస్ పార్టీ అంటే అంతేనా? అక్కడ కమిటీలంటే కాలయాపన కోసమేనా..? ఓ వైపు భగభగమని మండిపోతూ తగలబడుతుంటే… నిదానంగా చూద్దాం, చేద్దాం అన్న జానర్ నుంచి పార్టీ పెద్దలు సైతం బయటికి రాలేరా? అంతా కంటి తుడుపు వ్యవహారమేనా? ఇంతకీ… అసలీ ప్రస్తావన ఇప్పుడెందుకు వచ్చింది? ఏ కమిటీ విషయమై పార్టీలో చర్చ జరుగుతోంది? తెలంగాణ కాంగ్రెస్కి… బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేలతో లాభం కంటే.. తలనొప్పి ఎక్కువైందన్న అభిప్రాయం బలపడుతోంది. ఇందులో అతి ముఖ్యమైనది…
ఒక్క స్కూల్… ఒకే ఒక్క స్కూల్ ఆ ఇద్దరు నేతల మధ్య అగ్గి పెట్టిందా? నేను చెప్పిన చోటే ఏర్పాటు చేయాలంటే…. కాదు నేను చెప్పిన చోటే కావాలంటూ… ఒకరు స్టేట్ లెవెల్ లో ఇంకొకరు సెంట్రల్ లెవెల్ లో పైరవీలు చేస్తున్నారా..? అసలా బడితో… ఇద్దరు నేతలకు వచ్చే ప్రయోజనం ఏంటి..? ఎక్కడుందా స్కూల్..? సమరానికి సై అంటున్న నేతలు ఎవరు..? నవోదయ విద్యాలయం. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో 1986లో కేంద్ర…
అక్కడ టీడీపీ బీసీ లీడర్స్ ఫైరైపోతున్నారా? అన్నీ వాళ్ళకేనా….? మన సంగతేంది బాసూ… అంటూ వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నారా? ఆ విషయాన్ని అధిష్టానానికి చెప్పలేక, అలాగని కుదురుగా ఉండలేక లోలోపల రగిలిపోతున్నారా?. అధికారంలో ఉన్నాసరే… ఏంటీ ఖర్మ అనుకుంటూ మథనపడుతున్నారా? ఎవరా నాయకులు? ఎందుకు అంతలా ఫీలవుతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధాని బెజవాడ ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ బీసీ నేతలు లోలోపల రగిలిపోతున్నారట. 2024 ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం ఏడు అసెంబ్లీ, ఒక ఎంపీ…
కాకినాడ జిల్లా జగ్గంపేట కూటమిలో అగ్గి అంటుకోవడమే కాదు.... అది భగభగ మండే స్థాయికి వెళ్తున్నట్టు కనిపిస్తోంది. టీడీపీ, జనసేన నాయకులు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయికి వెళ్ళడమేకాకుండా... వీధి పోరాటాలకు సిద్ధమవడం కలకలం రేపుతోంది.
ఆరిణి శ్రీనివాసులు... తిరుపతి ఎమ్మెల్యే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో జనసేన టిక్కెట్ తెచ్చుకుని భారీ మెజారిటీతో గెలిచారాయన. ఎన్నికలకు ముందు వరకు వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న ఆరిణికి టిక్కెట్ ఇవ్వడాన్ని తిరుపతి టిడిపి జనసేన నేతలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. అయినాసరే... ఫైనల్గా ఆయనకే ఖరారు చేశారు పవన్కళ్యాణ్.
అసలు రాజకీయాల్లోకి వచ్చిన కారణంగానే ఈ ఆర్థిక సమస్యలు వచ్చానన్నది మాజీ ఎంపీ మనసులోని మాటగా ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో ఆర్థికంగా బాగా భరించాల్సి రావడం, ఆ తరువాత కూడా 2024 ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక భారం పడడంతోనే ఇబ్బందులు మొదలయ్యాయట. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఆమెను కొనసాగించకపోవచ్చన్న టాక్ నడుస్తోంది నియోజకవర్గంలో.
ఆరెస్సెస్ పెద్దల్ని ప్రసన్నం చేసుకుంటే కమలం పార్టీలో పదవులు చాలా ఈజీగా వస్తాయన్న ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. అదే అభిప్రాయంతో...బీజేపీ లీడర్స్ చాలామంది సంఘ్ ఆఫీసులకు క్యూ కడుతుంటారు కూడా. అయితే... ఇటీవలి కాలంలో ఇది మరీ శృతిమించిపోయిందని, నిన్నగాక మొన్న పార్టీ వేరే పార్టీలనుంచి బీజేపీలోకి మారిన వాళ్ళు కూడా మాకు పదవులు అంటూ తలుపు తడుతుండటం ఆర్ఎస్ఎస్ నేతలకు చిరాకు తెప్పిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
సీనియర్ ఐఏఎస్ అయిన స్మితాసభర్వాల్ ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నట్లుగానే భావిస్తున్నారని, కాంగ్రెస్ సర్కార్తో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని మంత్రులు కూడా అంటున్నారు. పర్యాటక శాఖలో ఫైల్స్ అన్నీ పెండింగులోనే పెట్టారని... సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ కు సైతం రెగ్యులర్గా రావడంలేని ఉద్యోగులే చెప్పుకుంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చల అంశాన్ని లీడ్ చేయాలని చూస్తోందా..? కేంద్రం ఇప్పటికే ఏరివేతలో బిజీగా ఉంటే... కాంగ్రెస్ ఇప్పుడు చర్చల మాట ఎందుకు మాట్లాడుతోంది? టార్గెట్ పెట్టి మరీ... కేంద్ర బలగాలు మావోయిస్టులను ఏరిపారేస్తున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వ మాటలు చెవికెక్కుతాయా? కేంద్రం తగ్గుతుందా..? గత అనుభవం అధిష్ఠానం పరిశీలనలో ఉందా..
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక మీద బోలెడు ఆశలు పెట్టుకుంది తెలంగాణ బీజేపీ. వాస్తవంగా మాట్లాడుకుంటే.... ఆ పార్టీకి సీటు గెలిచేంత బలం లేదు. ఆ విషయం పార్టీ ముఖ్యులు అందరికీ తెలుసు. పిక్చర్ క్లియర్గా ఉంది. అయినా సరే... ఉనికి కోసం బరిలో దిగింది కాషాయ దళం. అంతవరకు బాగానే ఉంది. కానీ.... ఆ పోటీ పేరుతో తమను తాము పరీక్షించుకునే దగ్గరే తేడా కొట్టిందంటున్నారు పరిశీలకులు. బీజేపీ కార్పొరేటర్స్ అందరి ఓట్లు కమలానికి…