ప్రాంతీయ పార్టీల రాజకీయమంతా... కుటుంబాల చుట్టూ తిరగడం, అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఏవైనా పొరపొచ్చాలొస్తే... ఆయా పార్టీలు నిలువెల్లా షేకైపోవడం సర్వ సాధారణమైంది. దేశమంతటా ఇదే తరహా పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ పరంపరలోనే... తాజాగా తెలంగాణ వంతు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెలు జగన్, షర్మిల మధ్య నడుస్తున్న వివాదాలు, జరిగిన, జరుగుతున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు ఎపిసోడ్లో ఎప్పటికప్పుడు ట్విస్ట్లు పెరుగుతూనే ఉన్నాయి. టీడీపీ తరపున మూడు సార్లు పోటీ చేసి రెండు విడతలు గెలిచిన వంశీ... ఒకసారి వైసీపీ బీ ఫామ్ మీద బరిలో దిగారు.
కొందరు వివాదం కోసం మాట్లడుతుంటారు.. మరికొందరు ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోదామని వాయిస్ పెంచుతుంటారు. కానీ... వాటన్నిటితో సంబంధం లేకుండా... మనసులో ఏది ఉంటే అది మాట్లాడి.. నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి కేంద్రంగా జేసీ బ్రదర్స్ రాజకీయాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది.
ఈ మధ్య కాలంలో కార్యకర్తలతో ఏ సమావేశం నిర్వహించినా వైసీపీ అధినేత జగన్ రిపీట్ చేస్తున్న ఒకే మాట జగనన్న 2.o. ఇక నుంచి కార్యకర్తలకు అగ్రతాంబూలం ఇస్తా.. మీకోసం ఎంతదాకైనా వస్తా..... అందర్నీ గుర్తు పెట్టుకుంటానని కూడా చెప్పుకొస్తున్నారు జగన్. 2019-24 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల్ని విస్మరించి కేవలం వాలంటీర్స్ని నెత్తిన పెట్టుకున్నారన్న విమర్శలున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై విస్తృత చర్చ జరుగుతోంది. వాళ్ళని వెనక నుంచి ఎవరో నడిపిస్తున్నారని, లేందటే.. వాళ్ళు అంత తేలిగ్గా.. మంత్రి పదవి పేరుతో ముందుకు నడిచేవాళ్ళు కాదని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. మంత్రి పదవుల పంపకంలో సామాజిక న్యాయం పాటించాలని కోరుకోవడంలో తప్పు లేదు.
వి.హన్మంతరావు అలియాస్ వీహెచ్. కాంగ్రెస్లోనే కాదు, తెలంగాణలోనే కాదు, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఆయనంటే తెలియని వారు ఉండరు. ఇంకా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కురువృద్ధుడాయన. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. తొలి నుంచి కాంగ్రెస్కు లాయల్గా ఉంటూ... అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారన్న పేరుంది.
వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ జూపల్లి వెంకటరత్నం సస్పెండ్ అయ్యారు. ఆయన మీద వేటు వేస్తూ... వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. డిపార్ట్మెంట్లో అలాంటివి సాధారణంగా జరుగుతుంటాయి. కానీ, ఈ సస్పెన్షన్ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే.. ఈ పోలీస్ స్టేషన్ ఇలాంటివి కామన్ అయిపోయాయి కాబట్టి.
గుంటూరు వెస్ట్.. రాజకీయంగా మంచి ప్రాధాన్యత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్. కానీ... ఇక్కడ ఇన్ఛార్జ్ని నియమించుకోలేక సతమతం అవుతోందట వైసీపీ. అలాగని.... పార్టీకి ఇక్కడ నాయకుల కొరతేం లేదు
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కొత్త పోకడలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ప్రత్యేకించి రాష్ట్రంలో ఇన్నాళ్లు పార్టీ పరిస్థితులకు భిన్నంగా... కనిపిస్తున్నాయని అంటున్నారు. ఎంత కూటమిలో ఉన్నా... అధికారం చెలాయిస్తున్నా... సొంత బలం ఉంటేనే గౌరవం అన్న నిర్ణయానికి వచ్చిన ఏపీ కాషాయదళం... ఆ దిశగా అడుగులేస్తోందట.
ఆ జిల్లాలో తమ్ముళ్ళను తగ్గమని తలంటేశారా? మరీ… ఓవర్ స్పీడ్ అయిపోవద్దని టీడీపీ పెద్దల నుంచి వర్తమానం అందిందా? మిమ్మల్ని ఎలా సెట్ చేయాలో మాకు తెలుసునంటూ వార్నింగ్లు సైతం వచ్చాయా? ఎక్కడి టీడీపీ నేతలకు ఆ స్థాయి వార్నింగ్స్ ఇచ్చారు? ఎందుకా పరిస్థితి వచ్చింది? కాకినాడ జిల్లా తెలుగు తమ్ముళ్ళు కొద్ది రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. పదవుల పందేరంలో తమను పక్కనపెట్టి జనసేనకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ బహిరంగంగానే బరస్ట్ అవుతున్నారు. దీంతో ఈ వ్యవహారంపై…