పెద్దపల్లి జిల్లా.. కోల్ బెల్ట్ ఏరియాతో పాటు అటు పారిశ్రామికంగానూ.. ఇటు వ్యవసాయ పరంగానూ ప్రాధాన్యత ఉన్న ప్రాంతం.... తెలంగాణ ఏర్పడ్డాక ఈ జిల్లాలో గణనీయమైన విజయాలు సాధించింది బీఆర్ఎస్. రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాలు పూర్తిగానూ, ధర్మపురి పాక్షికంగానూ ఈ జిల్లా పరిధిలో ఉన్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లా పరిధిలో ఒక్క సీటు కూడా గులాబీ పార్టీకి దక్కలేదు.
బాపట్ల జిల్లా.... అద్దంకి నియోజకవర్గం అంటేనే వర్గ రాజకీయాలకు కేరాఫ్. ఒకప్పుడు ఇక్కడ కరణం బలరాం వర్సెస్ బాచిన చెంచు గరటయ్యగా రాజకీయాలు నడిచేవి. ఆ తర్వాత గొట్టిపాటి రవికుమార్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. కొన్నాళ్ళు గొట్టిపాటి వర్సెస్ కరణం, మరి కొన్నాళ్ళు గొట్టిపాటి వర్సెస్ బాచిన కుటుంబాల పొలిటికల్ పోరు నడిచింది. రవికుమార్ నియోజకవర్గంలో పాతుకుపోవడంతో... ప్రత్యర్ధి ఎవరైనా గొట్టిపాటికి మరోవైపునే డీకొట్టాల్సిన పరిస్ధితి ఏర్పడిందన్నది లోకల్ టాక్.
సంగారెడ్డి జిల్లా బీజేపీ ఇటీవల కొత్త మండల అధ్యక్షుల్ని ప్రకటించింది. ఇక అంతే... ఆ ఒక్క ప్రకటనతో.... జిల్లా పార్టీలో వర్గపోరు భగ్గుమంది. తమను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం ఏంటంటూ.. పార్టీ ముఖ్య నాయకులు జిల్లా అధ్యక్షురాలిపై సీరియస్ అయినట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి నేతలు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ విడతలవారీగా జరుగుతోంది. తాజాగా డీసీసీబీ, మార్కెట్ యార్డ్ కమిటీల పదవుల పందేరం నడుస్తోంది. అదే సమయంలో అసంతృప్త స్వరాలు కూడా పెరుగుతున్నాయి. గత ఎన్నికల్లో టికెట్లు రానివాళ్ళతో పాటు పార్టీ వీర విధేయులకు ప్రాధాన్యం ఇస్తున్నామని టీడీపీ అధిష్టానం చెబుతున్నా.... అదే రేంజ్లో ఉన్న అందర్నీ సంతృప్తి పరచడం మాత్రం సాధ్యం కావడం లేదట.
తెలంగాణలో రాజకీయ అగ్గి ఈసారి డిఫరెంట్గా రాజుకోబోతోందా అంటే... అవును... అలాగే కనిపిస్తోందని చెబుతున్నారు పొలిటికల్ పరిశీలకులు. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అంటున్నారు. తాజాగా మీడియాతో కవిత అన్న మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. సామాజిక తెలంగాణ విషయమై ఈనెల మొదట్లో కవిత అన్న మాటల సెగలే ఇప్పటికీ తగ్గలేదు.
తన సొంత నియోజకవర్గంలోకి వెళ్లేందుకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు ఏడాదిగా బ్రేక్స్ పడుతూనే ఉన్నాయి. అసలు సొంత నియోజకవర్గంలోకి ఏంట్రీ లేకపోవడం ఏంటీ.. అంటే, 2024 అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వెళ్ళాల్సిందే. అప్పట్లో జరిగిన ఎన్నికల గొడవలతో... ఇటు జేసీ ఫ్యామిలీని అటు పెద్దారెడ్డి ఫ్యామిలీని తాడిపత్రిలో అడుగు పెట్టకుండా ఆంక్షలు విధించింది కోర్ట్. కొన్ని రోజుల తర్వాత ఆ ఆంక్షలు ఎత్తేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి…
నేతలందు చిత్తూరోళ్ళు వేరయా అన్నట్టుగా ఉందట టీడీపీలో పరిస్థితి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ సీట్లకుగాను 12 స్థానాలు గెలిచింది కూటమి.దీంతో పార్టీ కోసం పని చేసిన ముఖ్య నేతలంతా... మంత్రి పదవులు కోసం, మిగిలిన వారు నామినేటెడ్ పదవుల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూశారు.
కాంగ్రెస్ తెలంగాణలో అధికార పార్టీ. కానీ.. పవర్లో ఉన్న పార్టీకి ఉండాల్సిన లక్షణాలేవీ కనిపించడం లేదని సొంత నేతలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇంకా... నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే.. తల మాత్రమే ఉండి మొండెంలేనట్టుగా మారిపోయిందట తెలంగాణ కాంగ్రెస్.
తెలంగాణలో పదేళ్ళు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్... ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చింది. అందుకు కారణాలపై ఇప్పటికే పోస్ట్మార్టం పూర్తి చేసిన గులాబీ అధిష్టానం... జరిగిన తప్పుల్ని సరిదిద్దుకునే కార్యక్రమం మొదలుపెట్టిందట.