Off The Record: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కుమార్తె కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందా? లేక అది కేవలం ప్రచారమేనా? ఒకవైపు జగన్ చెల్లెలు షర్మిల తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపణలు గుప్పిస్తున్న క్రమంలో… ఆ లిస్ట్‌లో కవిత కూడా ఉన్నారా? ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ తాజాగా తనచుట్టూ తిరుగుతున్నా… అలాంటిదేం లేదని ఎమ్మెల్సీ ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఆ విషయంలో అసలేం జరుగుతోంది?
Read Also: Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేంద్ర మంత్రికి నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైన సిట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే వివాదాస్పదంగా మారిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి మోగిపోతోంది. సిట్ దర్యాప్తులో సంచలన అంశాలు వెలుగు చూస్తున్న క్రమంలో కవిత ఫోన్ ట్యాప్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వందల మంది ఫోన్‌లు ట్యాప్ చేసినట్లు ప్రచారం జరగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అదే పార్టీ ఎమ్మెల్సీ కవిత ఫోన్ ట్యాప్ చేశారా? అన్న చర్చ మొదలైంది. ఆ విషయంలో స్పష్టత లేకున్నప్పటికీ… పెన్ డ్రైవ్‌లో ఉన్నసమాచారం ఏంటన్న అనుమానాలు మాత్రం ఉన్నాయి. అందులో కీలక విషయాలు ఉన్నాయని అంటున్నారు దర్యాప్తు అధికారులు. ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు తమ ఫోన్స్ ట్యాప్ అయ్యాయని బహిరంగంగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఫోన్ టాప్ చేశారన్న విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత.. కవిత వ్యవహారం కూడా ఒక్కసారిగా మీడియాలో గుప్పుమంది. నాడు… కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోను కూడా టాప్ చేశారన్న చర్చ నడుస్తోంది రాజకీయ వర్గాల్లో. ఎందుకంటే.. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నంతకాలం కవిత దాదాపుగా పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉన్నారు. ఎక్కడా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయలేదు. ట్యాపింగ్ వ్యవహారం కవితకు తెలిసే ఆమె కామ్‌గా ఉన్నారన్నది పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తున్న లేటెస్ట్ టాక్. లిక్కర్స్ స్కాం వెలుగులోకి రావడానికి కొన్ని రోజుల ముందు నుంచే…దాదాపుగా ప్రభుత్వానికి దూరమయ్యారు కవిత. తన ఎమ్మెల్సీ పని తాను చేసుకుంటూ వెళ్ళారామె. ఆ తర్వాత అరెస్ట్, జైలు తెలిసిందే.
Read Also: Cucumber Benefits: రోజూ కీర దోసకాయ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు..?
అయితే, అందరి ఫోన్లు టాప్ అవుతాయని కవితకు ముందు నుంచే తెలుసు కాబట్టి… ఆమె సైలెంట్‌గా ఉన్నారన్న అనుమానాలు తాజాగా వ్యక్తం అవుతున్నాయట. ఫోన్స్ నిఘాలో ఉన్నందున కామ్‌గా ఉండటమే మేలని భావించినట్టు చెప్పుకుంటున్నారు. అయితే… కవిత ఫోన్‌ని డైరెక్ట్‌గా తండ్రి కేసీఆర్ ట్యాప్ చేయించారా, లేక ఆయన నోటీస్‌లో లేకుండా వేరే ఎవరన్నా చేయించారా అన్న అనుమానాలు సైతం ఉన్నాయట. ఈ వ్యవహారంలో గోనె ప్రకాష్‌ని ఇప్పటికే సిట్ అధికారులు పిలిచి విచారించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కవిత ఫోన్ మీద కూడా నిఘా పెట్టిందని ఆయనే చెప్పారు. ఆ మాటల్లో వాస్తవం ఎంతో తెలియదుగానీ…చాలా మంది రాజకీయ నాయకుల ఫోన్స్ ట్యాప్ అయ్యాయన్నది మాత్రం వాస్తవం అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. గోనె ప్రకాష్ వ్యాఖ్యల మీద కవిత ఇంకా స్పందించలేదు. ఇప్పటికే షర్మిల ఫోన్ ట్యాపింగ్ గొడవ నడుస్తోంది. అటు సినీ ప్రముఖులు, అప్పటి విపక్ష నాయకులతోపాటు సొంత ఇంట్లోని వారి ఫోన్స్‌ని కూడా బీఆర్‌ఎస్ పెద్దలు విన్నారంటూ విమర్శిస్తున్నారు కొందరు నాయకులు. కవిత రాజకీయంగా సొంతగా ఎదిగే ప్రయత్నం చేశారని, ఆ క్రమంలోనే… ఆమె ఎటువైపు అడుగులు వేస్తున్నారో తెలుసుకునేందుకు ఇంట్లోని మనిషి అయినా… ఆమె సంభాషణలను విన్నారన్న వార్తలు పొలిటికల్‌గా సంచలనం అవుతున్నాయి.
Read Also: Off The Record: నల్గొండ బీఆర్ఎస్ నేతలు అనాధలమైపోమంటూ ఎందుకు ఫీల్ అవుతున్నారు?
ఇక, కవిత ఫోన్ టాప్ చేయమని అప్పట్లో అధికారులకు ఎవరైనా సూచనలు చేశారా.. లేక అత్యుత్సాహంతో వాళ్ళే ఆ పని చేసి డేటాని ఇవ్వాల్సిన వాళ్లకు ఇచ్చేశారా అన్నది తేలాల్సి ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడంటే కవిత చిట్‌చాట్‌లో తీవ్ర విమర్శలు చేశారుగానీ…. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆమె తండ్రికి, కేటీఆర్‌కి దగ్గరగానే ఉన్నారని, అలాంటప్పుడు మా నాయకురాలి మాటలు వినాల్సిన అవసరం ఏం వచ్చిందన్నది కవిత అనుచరుల క్వశ్చన్. అసలు కవిత ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అన్న విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక నిర్ధారణ జరగలేదుగానీ… ఆ పేరుతో పొలిటికల్ చర్చలు మాత్రం జోరుగా జరిగిపోతున్నాయి. ఇదే విషయం కవితను మీడియా అడిగితే ఆమె సమాధానం దాటవేశారు. నిజంగానే ఏమీ జరక్కుంటే… అలాంటిదేం లేదని ఆమె ఖండించేవారు కదా అన్నది పరిశీలకుల ప్రశ్న. తన ఫోన్ టాపింగ్ జరిగిన సమాచారం ఆమెకు కూడా తెలుసు కాబట్టే ఖండించలేదంటున్నారు కొందరు. ఈ విషయంలో తాను ఏం మాట్లాడినా… అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న తండ్రి కేసీఆర్‌కు ఇబ్బంది గనుకనే… కవిత సైలెంట్ అవుతున్నారన్నది ఇంకో వెర్షన్. దీంతో రేపు దర్యాప్తు అధికారులు బయటపెట్టే పేర్లలో కవిత ఉంటారా లేదా అన్నది ఆసక్తికరమేనంటున్నారు పొలిటికల్ పండిట్స్.
Read Also: Kothwalguda Eco Park: త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి కొత్వాల్‌గూడ ఎకో పార్క్..
కాగా, ఫోన్స్ నిఘాలో ఉన్నందున కామ్‌గా ఉండటమే మేలని భావించినట్టు చెప్పుకుంటున్నారు. అయితే… కవిత ఫోన్‌ని డైరెక్ట్‌గా తండ్రి కేసీఆర్ ట్యాప్ చేయించారా, లేక ఆయన నోటీస్‌లో లేకుండా వేరే ఎవరన్నా చేయించారా అన్న అనుమానాలు సైతం ఉన్నాయట. ఈ వ్యవహారంలో గోనె ప్రకాష్‌ని ఇప్పటికే సిట్ అధికారులు పిలిచి విచారించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కవిత ఫోన్ మీద కూడా నిఘా పెట్టిందని ఆయనే చెప్పారు. ఆ మాటల్లో వాస్తవం ఎంతో తెలియదుగానీ…చాలా మంది రాజకీయ నాయకుల ఫోన్స్ ట్యాప్ అయ్యాయన్నది మాత్రం వాస్తవం అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. గోనె ప్రకాష్ వ్యాఖ్యల మీద కవిత ఇంకా స్పందించలేదు. ఇప్పటికే షర్మిల ఫోన్ ట్యాపింగ్ గొడవ నడుస్తోంది. అటు సినీ ప్రముఖులు, అప్పటి విపక్ష నాయకులతోపాటు సొంత ఇంట్లోని వారి ఫోన్స్‌ని కూడా బీఆర్‌ఎస్ పెద్దలు విన్నారంటూ విమర్శిస్తున్నారు కొందరు నాయకులు. కవిత రాజకీయంగా సొంతగా ఎదిగే ప్రయత్నం చేశారని, ఆ క్రమంలోనే… ఆమె ఎటువైపు అడుగులు వేస్తున్నారో తెలుసుకునేందుకు ఇంట్లోని మనిషి అయినా.. ఆమె సంభాషణలను విన్నారన్న వార్తలు పొలిటికల్‌గా సంచలనం అవుతున్నాయి.
Read Also: PM Modi in Vizag: విశాఖకు ప్రధాని మోడీ.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం..
మరోవైపు, కవిత ఫోన్ టాప్ చేయమని అప్పట్లో అధికారులకు ఎవరైనా సూచనలు చేశారా.. లేక అత్యుత్సాహంతో వాళ్ళే ఆ పని చేసి డేటాని ఇవ్వాల్సిన వాళ్లకు ఇచ్చేశారా అన్నది తేలాల్సి ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడంటే కవిత చిట్‌చాట్‌లో తీవ్ర విమర్శలు చేశారుగానీ…. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆమె తండ్రికి, కేటీఆర్‌కి దగ్గరగానే ఉన్నారని, అలాంటప్పుడు మా నాయకురాలి మాటలు వినాల్సిన అవసరం ఏం వచ్చిందన్నది కవిత అనుచరుల క్వశ్చన్. అసలు కవిత ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అన్న విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక నిర్ధారణ జరగలేదుగానీ… ఆ పేరుతో పొలిటికల్ చర్చలు మాత్రం జోరుగా జరిగిపోతున్నాయి. ఇదే విషయం కవితను మీడియా అడిగితే ఆమె సమాధానం దాటవేశారు. నిజంగానే ఏమీ జరక్కుంటే… అలాంటిదేం లేదని ఆమె ఖండించేవారు కదా అన్నది పరిశీలకుల ప్రశ్న. తన ఫోన్ టాపింగ్ జరిగిన సమాచారం ఆమెకు కూడా తెలుసు కాబట్టే ఖండించలేదంటున్నారు కొందరు. ఈ విషయంలో తాను ఏం మాట్లాడినా… అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న తండ్రి కేసీఆర్‌కు ఇబ్బంది గనుకనే… కవిత సైలెంట్ అవుతున్నారన్నది ఇంకో వెర్షన్. దీంతో రేపు దర్యాప్తు అధికారులు బయటపెట్టే పేర్లలో కవిత ఉంటారా లేదా అన్నది ఆసక్తికరమేనంటున్నారు పొలిటికల్ పండిట్స్.